30 రోజుల్లో 200 సార్లు చూసిన రాహుల్ రవీంద్రన్!

0

అక్కినేని నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు దర్శకుడు రాహల్ రవీంద్రన్ అనే సంగతి తెలిసింది. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన రాహుల్ ‘చిలసౌ’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాకు ప్రశంసలు లభించినా కమర్షియల్ గా పెద్ద విజయం మాత్రం లభించలేదు. ఇప్పుడు ‘మన్మథుడు 2’ సినిమా ఫలితంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కానీ ‘మన్మథుడు’ తో పోలికల విషయం మాత్రం రాహుల్ ను కాస్త టెన్షన్ పెడుతోందట.

నాగ్ కెరీర్లో క్లాసిక్ గా నిలిచిన చిత్రం ‘మన్మథుడు’. అందులో క్లీన్ కామెడీకి పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పటికీ ఆ సినిమా టీవీలలో వస్తే ప్రేక్షకులు రిమోట్ ను పక్కన పెట్టేస్తారు. అయితే ‘మన్మథుడు 2’ లో కాస్త బోల్డ్ టచ్ ఉండడంతో.. ఒరిజినల్ సినిమాను మించి ఉంటుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక నెటిజన్ ఈ ప్రశ్నను ఏకంగా రాహుల్ ను ట్విట్టర్ లో అడిగాడు. “మన్మథుడు చూశారా అన్నా? మన్మథుడు కు మించి ఉంటుందని ఆశించవచ్చా? అల్ ది బెస్ట్ టు యూ అన్నా” అని నెటిజన్ అడిగితే “గడిచిన 30 రోజుల్లో 200 సార్లు చూశాను. మన్మథుడు ఒక క్లాసిక్. ఆ సినిమాతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి.. నాకు కూడా. ఆ సినిమాతో పోల్చకుండా ఉంటే బెటర్. కానీ నా ఉద్దేశంలో మీరు ఈ సినిమాను కూడా లైక్ చేస్తారు” అంటూ రిప్లై ఇచ్చాడు.

అయినా రాహుల్ ‘మన్మథుడు 2’ సినిమా స్క్రిప్ట్ సమయంలో అన్ని సార్లు ఒరిజినల్ సినిమాను చూస్తే.. ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది కానీ ఇప్పుడు షూటింగ్ అంతా అయిపోయాక రెండు వందల సార్లు చూడడం ఎందుకు? అంటే.. పోయిన నెలంతా లవంగం-ఆల్డా తోనే సమయం గడిచిపోయి ఉంటుంది!
Please Read Disclaimer