ఇదెక్కడి కవరింగ్ డైరెక్టర్ గారు

0

నాగార్జున ఎన్నో ఆశలు రేకెత్తించి ఎన్నో అంచనాలు కలిగేలా చేసిన మన్మథుడు 2 ఫైనల్ రన్ కు వచ్చింది. వేరే ఆప్షన్ లేక ఫీడింగ్ కోసం కొన్ని మెయిన్ సెంటర్స్ లో రన్ చేస్తున్నారు కానీ మినిమమ్ కలెక్షన్ కూడా లేక హాళ్లు అధిక శాతం వెలవెలబోతున్నాయి. ఆఫీసర్ తర్వాత ఆ స్థాయి డిజాస్టర్ అని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. హిట్టు ఫ్లాపు ఎలాంటి హీరోకైనా సహజమే కానీ ఇందులో కంటెంట్ గురించి వచ్చిన విమర్శలు నాగ్ ఇన్నేళ్ల కెరీర్ లో దేనిమీదా రాలేదన్నది వాస్తవం. ట్రెండ్ పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రదర్శించిన తీరు మీద నెగటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి.

మొదట్లో సైలెంట్ గా ఉన్నా ఫైనల్ గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దీని గురించి స్పందించాడు. నన్ను చాలా మంది ఫెమినిజం గురించి ఇందులో చూపించిన బోల్డ్ నెస్ గురించి అడుగుతున్నారని మహిళల పట్ల ఎంతో గౌరవం ఉండేలా నాగ్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దామని ఎవరైతే స్త్రీల పట్ల గౌరవంతో ఉంటారో వాళ్లకు విడిపోయే కలిసిపోయే హక్కులు ఉంటాయని కొత్త నిర్వచనం ఇచ్చాడు

అంతే కాదు కాదు వెన్నెల కిషో ర్ తో ఓ సందర్భంలో నాగార్జున అమ్మాయిలను పడేయడం ఏంట్రా ఆ మాటంటేనే నాకు చిరాకు అని చెప్పడాన్ని కూడా రాహుల్ ఉదాహరిస్తున్నాడు. ఇదొక్క డైలాగ్ చాలని హీరోకున్న విలువల గురించి ఇదే మాట్లాడుతుందని చెప్పాడు. మరి అదే వెన్నెల కిషోర్ బయట నిలబడినప్పుడు బెడ్ రూమ్ లో నాగ్ పాత్ర చేసే శృంగార అరాచకాన్ని కూడా ఏమంటారో చెబితే బాగుండేదని నెటిజెన్ల కామెంట్స్. ఎలా కవర్ చేసుకున్నా మన్మథుడు 2 ఫలితమైతే మారదు. కాకపోతే మేము గొప్ప సినిమా తీశాం అద్భుతమైన పాత్రలను సృష్టించాం అని చెప్పుకోవడం వల్ల మరికొన్ని విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందే తప్ప ఇంకే ప్రయోజనం లేదు
Please Read Disclaimer