స్క్రిప్టు పనిలో టాక్సీవాలా డైరెక్టర్

0

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన `టాక్సీవాలా` ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై మంచి సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు సినిమాపై బోలెడంత నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. సినిమాని దెబ్బ కొట్టాలని విజయ్ యాంటీ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోందని అప్పట్లో కథనాలు వేడెక్కించాయి. దీంతో మెగా నిర్మాత రంగంలోకి దిగడం… విజయ్ ని టచ్ చేసే ముందు తనని దాటి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆ వర్గం స్పీడ్ తగ్గించింది. నాటి నుంచి రౌడీ స్టార్ జోలికి ఎవరూ రాలేదు. ఈ స్టింట్ అంతా టాక్సీవాలాకి బోలెడంత పబ్లిసిటీ ని తెచ్చిపెట్టింది.

ఇది పబ్లిసిటీ ఎత్తుగడ! నిజంగా వార్నింగ్ లు వెళ్లాయా? అన్నది పక్కనబెడితే ఈ సినిమా అందించిన నిర్మాతలు మాత్రం బాగానే లాభాలు ఆర్జించారు. జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్- ఎస్.కె.ఎన్ బృందం రిలీజ్ చేసి లాభాలు పంచుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ దర్శకుడికి మాత్రం సెకెండ్ ఛాన్స్ రాలేదు. పరిమిత బడ్జెట్ లో మంచి సక్సెస్ ఇచ్చినా ఏ నిర్మాతా రాహుల్ సినిమా చేయడానికి ముందుకు రాలేదు ఎందువల్లనో. దీంతో లాభం లేదనుకున్న టాక్సీవాలా త్రయమే మరోసారి ముందుకొచ్చిందట. రాహుల్ తో మరో సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

రాహుల్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. మొదటి సినిమాతోనే తనదైన సెన్సిబిలిటీస్ .. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న రాహుల్ ఈసారి ఎలాంటి స్క్రిప్టును రాస్తున్నారో చూడాలి. కొత్త ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న ప్రకటిస్తారా అన్నది చూడాలి.
Please Read Disclaimer