రాహూల్ సిప్లిగంజ్ పై దాడి చేసింది ఇలా..

0

అర్ధరాత్రి పబ్ లో ఓ చిన్న విషయమై మొదలైన వివాదం ఏకంగా పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వెళ్లాయి. సినిమాల్లో చూసినట్టు ప్రముఖ గాయకుడు రాహూల్ సిప్లిగంజ్ పై దాడికి పాల్పడ్డారు. బీరు బాటిళ్లు పగిలాయి.. పిడిగుద్దులు పడ్డాయి.. అందరూ కలిసి ఒక్కడిని చేసి మూకుమ్మడి దాడి చేశారు. ఇది రాహూల్ సిప్లిగంజ్ పై జరిగిన దాడి. దానికి సంబంధించిన వీడియో మీడియాలో వైరలైంది. తన స్నేహితురాలితో పబ్ కు వచ్చిన రాహూల్ సిప్లిగంజ్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంబంధికుల మధ్య రచ్చ జరిగింది.

అయితే ఈ దాడి విషయంలో ఇద్దరి వాదనలు వేరుగా ఉన్నాయి. రాహూల్ ప్రవర్తనతో తాము విసుగుచెందామని కొట్టిన వారు అంటుండగా.. లేదు తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించడంతో తాను ప్రశ్నిస్తే దాడికి పాల్పడ్డారని బాధితులు పేర్కొంటున్నారు. దీంతో అసలు పబ్ లో ఏం జరిగిందో తెలియడం లేదు.

బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు తన స్నేహితురాలితో రాగా.. పార్టీలో కొద్దిసేపటి తర్వాత తన స్నేహితురాలితో అక్కడున్న వారు అనుచితంగా వ్యవహరించారని రాహూల్ సన్నిహితులు చెబుతున్నారు. దీన్ని ప్రశ్నించిన రాహూల్ తో వారు దుర్భాషలాడారని ఈ సమయంలో మాటామాటా పెరిగి దాడికి దారి తీసిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాహూల్ ను ఓ ఐదారుగురు చుట్టు ముట్టేసి పిడిగుద్దులు గుద్దుతుంటే.. మరొకరు బీరు బాటిల్ తీసుకుని నెత్తి మీద పగలగొట్టేశారు. దీంతో రాహుల్ తీవ్రంగా గాయపడంతో అక్కడి వారు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సంబంధికులు రాహూల్ ప్రవర్తన సక్రమంగా లేదని తమతో దుర్భాషలాడారని పేర్కొంటున్నారు. రాహూల్ తమతో ప్రవర్తించిన తీరు బాగా లేకపోవడంతో ప్రశ్నించగా.. దాడికి పాల్పడ్డారని దాడి చేసిన వారు చెబుతున్నారు. తమ తప్పేం లేదని రాహూల్ వలనే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్న మాు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల్ని నియంత్రించారు. రాహూల్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మిగతా వారు వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై రాహూల్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిపై పోలీసులు సుమోటోగా కేసు తీసుకొని విచారణ చేపట్టే అవకాశం ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-