‘బిగ్ బాస్ 3’ విజేత బెంజ్ కార్ బాప్ రే

0

కింగ్ నాగార్జున హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ సక్సెసైన సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అందరి మనసులు దోచాడు. ఫైనల్లో యాంకర్ కం నటి శ్రీముఖిని వెనక్కి నెట్టి విజేతగా నిలిచిన రాహుల్ రూ.50లక్షలు గెలుచుకున్నాడు. అయితే తాను విజేతను అయితే పేరెంట్స్ కి సొంతంగా ఓ అపార్ట్ మెంట్ కొని కానుక ఇస్తానని అన్నాడు.

అయితే సొంత అపార్ట్ మెంట్ కానుకిచ్చాడో లేదో కానీ తాను మాత్రం బెంజ్ కార్ కొన్నాడు. బంజారాహిల్స్ బెంజ్ షో రూమ్ నుంచి ఈ కార్ ని కొనుక్కున్నాడు రాహుల్. మెర్సిడెస్ బెంజ్ కార్ అంటే మినిమం రేంజు 30లక్షల నుంచి కోటి పైగానే ఉంది. అంతటి ఖరీదైన కార్ కొన్నాడంటే బిగ్ బాస్ చెక్ తో పాటుగా గెలుపు అనంతరం ఆ క్రేజుతో రకరకాల ఈవెంట్లతో బిజీ అయ్యి భారీగానే ప్యాకేజ్ లు అందుకున్నాడన్న చర్చా అభిమానుల్లో సాగుతోంది. బిగ్ బాస్ విజేతగా అతడికి జనాల్లో ఉన్న క్రేజు కమర్షియల్ గానూ వర్కవుటవుతోందట.

ఇక రాహుల్ హీరోగా ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదంతా సరే కానీ.. బిగ్ బాస్ పార్టిసిపెంట్ కాకపోయినా అతడి కొలీగ్ కం మ్యూజిక్ డైరెక్టర్ వెంగి ఇటీవలే బ్రెజ్జా బ్రాండ్ రెడ్ కార్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. “రాహుల్ కి తొలిగా తన తండ్రి గారు ఓ స్విఫ్ట్ కార్ ని కొనిచ్చారు. ఇప్పుడు తన కష్టంతో బెంజ్ కార్ కొనడం ఆనందాన్నిచ్చింది. ప్రతిభకు దక్కిన గౌరవమిది“ అని వెంగీ సుధాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కెరీర్ ఆరంభం రాహుల్ ని ఎం.ఎం.కీరవాణికి పరిచయం చేసినది వెంగీనే అన్న టాక్ మీడియాలో ఉంది.
Please Read Disclaimer