సొంతిల్లు లేదు.. కానీ బెంజ్ లో తిరగాలి!

0

బిగ్ బాస్ సీజన్ -3 విన్నర్ అయిన తర్వాత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అరకొర అవకాశాలతో సింగర్ గా కెరీర్ బండిని నెట్టుకొస్తున్న రాహుల్ కి బిగ్ బాస్ ఓ ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు సింగర్ గా అవకాశాలు పెరుగుతున్నాయి. రిబ్బన్ కటింగ్ ల ద్వారా ఆదాయం వస్తోంది. సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తండలో ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. రాహుల్ కి జోడీగా శివాత్మిక ను ఎంపిక చేసారు. ఆ విషయాలు పక్కన బెడితే రాహుల్ విజేత అయిన తర్వాత బిగ్ బాస్ ద్వారా వచ్చిన 50 లక్షల ప్రైజ్ మనీని ఏం చేసాడు? అప్పట్లో ఓ సొంతిల్లు కొంటానని.. తన తండ్రికి ఓ షాప్ పెట్టిస్తానని చెప్పాడు. మరి ఇల్లు కొన్నాడా? షాపు పెట్టాడా? లేదా? అన్నది పక్కబెడితే ఖరీదైన బెంజ్ కారు కొని వార్తలకెక్కాడు. దీనిపై నెటిజనుల ట్రోల్స్ పోటెత్తుతున్నాయి.

కొందరు బెంజ్ కొన్నందుకు రేంజ్ మారిందంటూ ప్రశంసిస్తుంటే ఇంకొందరు ఉండటానిక సొంతిల్లు లేదు…నీకు బెంజ్ అవసరమా? అంటూ విమర్శిస్తున్నారు. నీ సరదాలు తీర్చుకుంటున్నావా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. నెటి జనుల కామెంట్లు శృతిమించడంతో రాహల్ రంగంలోకి దిగి వాళ్లందరికి కౌంటర్లు వేస్తున్నాడు. అనవసరంగా టెన్షన్ పడకండి. నేను ముందే ఓ ప్లాట్ కొన్నాను. అది రెడీ అవ్వడానికి 7 నెలలు సమయం పడుతుంది. టేస్ట్ ది థండర్..జస్ట్ చిల్ అంటూ బెంజ్ ముందు థమ్స్ తాగుతూ ఫోజు కొట్టాడు. అయినా రాహుల్ ని వదల్లేదు. నెటిజనులు తమదైన శైలిలో పంచ్ లేస్తూనే ఉన్నారు.

దీంతో రాహుల్ సోషల్ మీడియా ఫ్యాన్స్ లైన్ లోకి వచ్చారు. బెంజ్ లో తిరగాలంటే సొంతిల్లు ఉండాలా? ఇల్లు లేకపోతే బెంజ్ స్టార్ట్ కాదా? బెంజ్ కి బండిలో అయిలుంటే సరి పోతుంది. మ్యాటర్ తెలియకుండా వేలు పెట్టకండి.. మా చిచ్చాని ట్రోల్ చేయోద్దంటూ కౌంటర్లు వేసారు. దీంతో ట్రోలర్స్ మరింత రెచ్చిపోతున్నారు. మీ చిచ్చా ఎంతటి జల్సారాయుడో మాకు తెలుసంటూ..అతని గతం మీకే తెలియదంటూ రాహుల్ అభిమానులను ఉద్దేశించి ఫైర్ అవుతున్నారు. మరి సోషల్ మీడియాలో లేచిన ఈ వార్ కి రాహుల్ ఎలాంటి ముగింపు పలుకుతాడో చూద్దాం.
Please Read Disclaimer