పున్ను గురించి రాహుల్ చెప్పిన డార్క్ సీక్రెట్!

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం ఇంట్లో శ్రీముఖి.. రాహుల్.. బాబా భాస్కర్.. వరుణ్ మరియు అలీలు ఉన్నారు. ఈ అయిదుగురిలో ఒకరు ఈ సీజన్ టైటిల్ విన్నర్ అవుతారు. నిన్నటి ఎపిసోడ్ ను మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్ తో ఎంటర్ టైన్ చేశారు. బిగ్ బాస్ ఇంట్లోకి విజయ్ దేవరకొండ వెళ్లి ఆశ్చర్యపర్చాడు. మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక రహస్యాన్ని నాతో చెప్పండి అంటూ ఇంటి సభ్యుల నుండి ఆయన రహస్యాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

మొదట శ్రీముఖి తనకు బాబా భాస్కర్ ను వేసేయాలని ఉందంటూ చెప్పింది. తానే విన్నర్ ను అంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చింది. శివ జ్యోతి రహస్యం చెబుతూ తనకు శ్రీముఖి విన్నర్ అవ్వడం ఇష్టం లేదంది. ఇక రాహుల్ అందరికంటే చాలా విభిన్నంగా ఒక రహస్యాన్ని చెప్పాడు. కాకరకాయ జ్యూస్ తాగి పునర్నవిని సేవ్ చేసిన సమయంలో ఆమె ముద్దు పెట్టింది. అది అందరు చూసి ఉంటారు. కాని ఆమె ఒకసారి నా చేయి గట్టిగా కొరికి పారిపోయింది.

చేయి కొరికి పారిపోయిన విషయాన్ని రాహుల్ చెప్పడంతో నాగార్జున గట్టిగా నవ్వారు. ఇది అందరు చెప్పిన రహస్యాల కంటే పెద్ద రహస్యం అన్నాడు. రాహుల్ మరియు పునర్నవిల మద్య స్నేహంను మించి ఏదో ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్న విషయం తెల్సిందే. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మా ఇద్దరిది మంచి స్నేహం అంటూ రాహుల్ మరోసారి చెప్పాడు.
Please Read Disclaimer