కెప్టెన్ టాస్క్ కోసం పోటీ పడనున్న ఆ ముగ్గురు…

0

బుధవారం ఎపిసోడ్ లో ఛలో ఇండియా టాస్క్ తో ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు గురువారం కూడా ఫుల్ గా అల్లరి చేశారు. ఇంటి సభ్యులు తమ పాత్రల్లో జీవిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ ఎక్కి దేశంలోని వివిధ ప్రాంతాలని చుట్టేసి వచ్చారు. అలాగే ట్రైన్ ఆగిన స్టేషన్స్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇచ్చి ఆటను రక్తికట్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలు టాస్క్ లు విజయవంతంగా పూర్తి చేసిన ఇంటి సభ్యులకి చివరిలో కొబ్బరికాయలకు పీచు తీసే టాస్క్ ఇచ్చారు.

ఇందులో బాబా భాస్కర్ – వరుణ్ సందేశ్ టాస్క్ లో పోటీ పడ్డారు. అయితే బాబా నోటితోనే పీచు వలిచి విన్నర్ గా నిలిచారు. దీని తర్వాత బిగ్ బాస్ ఎక్స్ ప్రెస్ చివరిగా హైదరాబాద్ స్టేషన్ చేరుతుంది. ఇక్కడ మగ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ముత్యాలని హారంగా తయారు చేసి నచ్చిన అమ్మాయి మెడ లో వేయాలని చెప్పారు. దీంతో అందరూ హారంగా కట్టేసి నచ్చిన వాళ్ళ మెడ లో వేసేస్తారు. అయితే ఎక్కువ అందంగా హారం తయారుచేసి హిమజ మేడ లో వేసిన మహేశ్ విన్నర్ గా నిలిచాడు.

ఇక టాస్క్ తో ఛలో ఇండియా టూర్ కూడా ముగిసింది. అయితే ఈ టూర్ లో మంచి ప్రదర్శన చేసిన ముగ్గురు సభ్యుల పేర్లని చెప్పాలని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు సూచించాడు. దీంతో అందరూ ఏకాభిప్రాయంతో బాబా భాస్కర్ – రాహుల్ – వరుణ్ పేర్లు చెప్పారు. అయితే ఈ ముగ్గురు కెప్టెన్ టాస్క్ లో పోటీ పడతారని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ ముగ్గురు శుక్రవారం జరిగే ఎపిసోడ్ లో మట్టిలో పొరాడి కెప్టెన్ పదవిని దక్కించుకోనున్నారు.
Please Read Disclaimer