ఫాల్తు మొఖం అన్న రాహుల్…చెప్పుతెగుద్దన్న హిమజ…

0

బిగ్ బాస్ ఇంటి సభ్యుల మధ్య గొడవ పెట్టె కార్యక్రమాలని ముమ్మరం చేశారనిపిస్తోంది. మంగళవారం ఎలిమినేషన్ లో ఉన్న సభ్యులకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ల్లో భాగంగా మిగతా ఇంటి సభ్యులతో గట్టిగానే గొడవలు జరిగాయి. ఎలిమినేషన్ లో ఉన్న రవి – రాహుల్ – మహేశ్ – హిమజ – పునర్నవి – వరుణ్ ల్లో ముగ్గురు సీక్రెట్ టాస్క్ పాల్గొనే అవకాశం ఉందని – వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే వారు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారని చెప్పారు. దీంతో మహేశ్ – పునర్నవి – హిమజ లు త్యాగం చేస్తూ ఎలిమినేషన్ లో ఉంటామని చెబుతూ…రవి – వరుణ్ – రాహుల్ లకు అవకాశం ఇచ్చారు.

ఇక ఈ ముగ్గురుకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లు ఇచ్చారు. ఇందులో మొదటిగా రవి వితిక తలకు షేవింగ్ ఫోమ్ రాసేసి శివజ్యోతి బెడ్ ని నీటితో తడిపేస్తాడు. ఆ తర్వాత రాహుల్ టాస్క్ లో భాగంగా మొదట వరుణ్-వితికల బెడ్ మీద ఉండే హార్ట్ షేప్ కుషన్ ని చింపేస్తాడు. ఆ తర్వాత ఒకరికి కోపం తెప్పించే టాస్క్ లో భాగంగా రాహుల్ కి అలీ – శ్రీముఖి – వితిక – శివజ్యోతి – బాబా భాస్కర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది.

రాహుల్ ని కదలనివ్వకుండా వీరు అడ్డుపడ్డారు. దీంతో వారిని రాహుల్ నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వితికని చేతులతో పైకి లేపి పక్కనబెట్టాడు. దీంతో వితికాను ఎందుకు లేపుతున్నావంటూ హిమజ అరుచుకుంటూ మీద పడింది. దీంతో రాహుల్ నోరు జారి.. ‘‘పిచ్చి మెంటలా నీకు.. ఫాల్తు మొఖం చేతలు చేయకు’’ అన్నాడు. వెంటనే రాహుల్ మీదుకి దూసుకెళ్లిన హిమజ.. ‘‘మొహం పగులుద్ది.. చెప్పుతెగుద్ది చెబుతున్నాను.. బేవార్స్’’ అంటూ ఊగిపోయింది.

ఆ తర్వాత వితిక-వరుణ్ మధ్య వాగ్వాదం జరిగింది. రాహుల్ అలా చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నవని వితిక – పై మండిపడింది. అది టాస్క్ లో భాగమని వరుణ్ చెప్పే ప్రయత్నం చేశాడు. అయిన వితిక వరుణ్ పై ఫైర్ అవుతూనే ఉంది. ఇక వరుణ్ టాస్క్ లో భాగంగా వితిక పై చల్లని కాఫీ విసిరేసి – ఆమెకు నచ్చిన బట్టలని కత్తిరించేశాడు. దీంతో వితిక ఇంకా హార్ట్ అయింది. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మిగతా బట్టలని బయటపడేస్తుంది. అయితే చివరికి బిగ్ బాస్ టాస్క్ గురించి చెప్పి రాహుల్ -వరుణ్ – రవిలు సేఫ్ అయినట్లు చెబుతాడు. దీంతో ఈ ముగ్గురు మిగతవారిని క్షమాపణ కోరడంతో గొడవలు సద్దుమణిగాయి.
Please Read Disclaimer