నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్ వి..నాకోసం కోసుకునే వాళ్ళు ఉన్నారు

0

బిగ్ బాస్ షోలో గత కొన్ని రోజులుగా రాహుల్ – పునర్నవిల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది పూర్తిగా లవ్ ట్రాక్ కాకపోయిన వారు ఫ్రెండ్ షిప్ లో డెప్త్ గా ఉన్నారు. కానీ తాజా పరిస్తితులు చూస్తుంటే వీరి బంధానికి బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. బిగ్ బాస్ షో సోమవారం ఎపిసోడ్ లో వీరి మధ్య చిన్నపాటి గొడవే జరిగింది. ఎపిసోడ్ ప్రారంభంలోనే అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక విషయం మీద వీరు ముచ్చట్లు పెట్టుకున్నారు.

అలా ముచ్చట్లు మధ్యలోనే పునర్నవి రాహుల్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో రాహుల్ పున్నూకు ఊహించని షాక్ ఇస్తూ నాలుగు పంచ్ డైలాగులు పేల్చాడు. “బయట నీలాంటోళ్లు బొచ్చుడు మంది ఉన్నారు. అసలు నువ్ నాకు ఏమి అవుతావ్ చెప్పు. నువ్ ఆఫ్ట్రాల్ ఫ్రెండ్ వి మాత్రమే. నాకోసం కోసుకునే వాళ్లు ఉన్నారు. నువ్ కోసుకుంటావా చెప్పు” అంటూ రాహుల్ పునర్నవిపై పంచ్ లు వేశాడు. ఇక ఈ డైలాగులకు హార్ట్ అయిన పున్నూ నిద్రోస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ తర్వాత ఇద్దరు ఎడ మొహం పెడ మొహంగానే ఉన్నారు. అయితే వీరిని వరుణ్ కలిపే ప్రయత్నం చేశాడు. పునర్నవిని రాహుల్ దగ్గరకు తీసుకొచ్చి మాట్లాడించాలని చూశాడు. కానీ ఈలోపు రాహుల్ నవ్వుతూ కనిపించాడు. దీంతో పున్నూకు ఒళ్ళు మండి ఛీ వాడితో నేను మాట్లాడనని తిట్టుకుంటూ వెనక్కి వెళ్లిపోయింది. ఇక వరుణ్-వితికల దగ్గర కూడా రాహుల్ పై మండిపడుతూ… ఈ హౌస్ లో ఉండాలని లేదని – వెంటనే బయటకి పంపేయండి అని బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేసింది.

ఇక వీరి ట్రాక్ మధ్యలో హౌస్ లో వారం మొత్తంలో జరిగిన వాటిపై బిగ్ బాస్ వీక్లీ పేపర్ పంపించారు. ఇందులో ఆసక్తికరమైన హెడ్డింగులతో హౌస్ మేట్స్ పై వార్తలు వచ్చాయి. పునర్నవి లవ్ ట్రాక్ – బాబా భాస్కర్ వంట.. అలీ కండలపై – హౌస్ లో గ్రూపుల గురించి ఫన్నీ వార్తల్ని ప్రచురించారు.
Please Read Disclaimer