పురుషాధిక్యంపై ధిక్కారమా?

0

వివాదాల రాణి కంగన దెబ్బకు ప్రత్యర్థులు గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులపై మీటూ వేదికగా క్వీన్ కంగన .. తన సోదరి రంగోలీ విరుచుకుపడుతున్న తీరు ట్రెండింగ్ అవుతోంది. శత్రువులకు కంటి మీద కునుకు పట్టనీకుండా చేస్తున్నారు ఈ ఇద్దరూ. అయితే కంగన ఓవైపు కోర్టు బ్యాటిల్ తో పాటు మరోవైపు కెరీర్ పరంగానూ దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది.

ఇటీవలే మణికర్ణిక చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కంగన వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం `మెంటల్ హై క్యా` అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో కంగనతో పాటు రాజ్ కుమార్ రావ్ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో వేగం పెంచేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే టైటిల్ వివాదం కారణంగా ఇటీవల ఓ ప్రమోషన్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేయాల్సొచ్చింది. ఈ సినిమా టైటిల్ మనోభావాలను కించపరిచేలా ఉందని వివాదం చెలరేగింది. కారణం ఏదైనా వివాదంతో ప్రచారం ఈ సినిమాకి కలిసొచ్చింది. అలాగే ఈ చిత్రానికి `లవ్ థి నైబర్` అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం మొదలు పెట్టారు. పిచ్చి పిచ్చిగా తమకు నచ్చినట్టు ప్రవర్తించే ఇరుగు పొరుగు అమ్మాయి అబ్బాయి కథతో ఈ సినిమాని ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు మెంటల్ వాళ్ల తో పక్కవాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అన్నదానిని ఆఫ్ బీట్ కాన్సెప్టుతో రూపొందిస్తున్నారు. మానసిక రుగ్మతల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిదని ఎవరి మనోభావాల్ని కించబరచడం లేదని చిత్రయూనిట్ చెబుతోంది.

అయితే ఇటీవల ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వెనక వేరొక కారణం తాజాగా లీకైంది. మణికర్ణిక రిలీజైన కేవలం రెండే రెండు నెలల్లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఓవైపు షూటింగులు.. మరోవైపు ప్రచారం అంటే షెడ్యూల్ కఠినంగా ఉంటుందని కంగన భావిస్తోందట. దాంతో ప్రచార కార్యక్రమం క్యాన్సిల్ చేశారు. మరోవైపు `మెంటల్ హై క్యా` పెండింగ్ చిత్రీకరణలోనూ కంగన పాల్గొంటోంది. తనతో పాటే ఆన్ లొకేషన్ రాజ్ కుమార్ రావ్ కనిపించారు. ఆ ఫోటోల్లో కంగన కు గొడుగు పడుతున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి. ఇక కంగన కాస్ట్యూమ్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. కాటుక కళ్లు.. వెరైటీ హెయిర్ స్టైల్ తో కంగన మోడ్రన్ రాణీవారిలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పురుషాధిక్యాన్ని వ్యతిరేకించే కంగనకు ఇదిగో ఇలా ఓ మగాడే గొడుగు పట్టారు మరి. పురుషాధిక్యంపై ధిక్కారం అంటే ఇదేనేమో!! అందుకే ఇలా పురుషులపై కక్ష తీర్చుకుంటుందా? అంటూ నెటిజనుల్లో గుసగుస మొదలైంది.
Please Read Disclaimer