ఓటీటీ కోసం ఓ మెట్టు దిగొచ్చిన యువహీరో

0

ఓటీటీ వద్దు పెద్ద తెర ముద్దు! అని భీష్మించుకుని కూచున్న చాలా మంది ఇక చేసేదేమీ లేక ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిపోతున్నారు. ఏతా వాతా ఇప్పటికే 20 పైగా సినిమాలు రిలీజ్ ల కోసం క్యూ లైన్ లో వెయిటింగు లో ఉన్నాయి. వీళ్లంతా నేడో రేపో థియేటర్లు తెరుచుకుంటాయన్న హోప్ తో ఉన్నవారే. కానీ ఏం ప్రయోజనం లేదు. మహమ్మారీ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇంకా ఇంకా ఉధృతి పెరుగుతోంది. దీంతో ఇక హీరోల మైండ్ సెట్ లో కూడా మార్పు వచ్చేస్తున్నట్టే కనిపిస్తోంది. నిర్మాతలు ఇప్పటికే ఓటీటీ రిలీజ్ లకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక పై వరుసగా ఒక్కో సినిమా ఓటీటీ బాట పట్టడం ఖాయం గా కనిపిస్తోంది.

ఇటీవలే కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఓటీటీ లో రిలీజై పోయింది. అంతకు ముందే కృష్ణ అండ్ హిజ్ లీల ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే రెండు మూడు తెలుగు సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. మునుముందు ఈ సంఖ్య పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే దారిలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఓటీటీ రిలీజ్ కి అంగీకరించాడని తెలుస్తోంది. మూడు నెలలుగా థియేటర్లు తెరుచుకునే సమయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసినా ఫలితం కనిపించలేదు. భవిష్యత్ ఆశలు కూడా వదిలేశాడు. అందుకే ఇప్పుడు తాను నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని ఓటీటీలో వదిలేందుకు అంగీకరించాడట.

ప్రస్తుతం ప్రచారం మొదలు పెట్టారు. మునుముందు మరింతగా జనాల్లోకి దూసుకెళ్లేలా పబ్లిసిటీ చేయనున్నారట. రాజ్ తరుణ్ దిగొచ్చాడు. మునుముందు నాని.. సుధీర్ బాబు.. శర్వానంద్.. సహా ఇంకా పలువురు హీరోలు రెడీ అవుతారనే భావిస్తున్నారు.
Please Read Disclaimer