పట్టించుకోకుండా సినిమాను ముంచేలా ఉన్నారే!

0

యవ హీరో రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో వరస హిట్లతో మంచి జోరుమీద ఉండేవాడు. అయితే విజయాలు కానివ్వండి.. పరాజయాలు కానివ్వండి అవేవీ శాశ్వతం కాదు. అందుకే హిట్ల జోరు తగ్గగానే ఫ్లాపుల హోరు మొదలైంది. ఫ్లాపులు కూడా పర్మనెంట్ కాదు కానీ ఇప్పటివరకైతే రాజ్ తరుణ్ ఫ్లాపులు ఆగలేదు. రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో నటిస్తున్నాడనే సంగతి తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ ఫ్లాపుల ఎఫెక్ట్ ఏమో కానీ ఈ సినిమా గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

‘ఇద్దరిలోకం ఒకటే’ సినిమా కు దర్శకుడు జీ.ఆర్. కృష్ణ. రాజ్ తరుణ్ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈమధ్య రాజుగారు తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే టాక్ ఉంది. ఈమధ్య ఆయన బ్యానర్ లో రిలీజ్ అయిన ‘ఎవరికి చెప్పొద్దు’ సినిమాపై ఈ విషయంలో జోక్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ సినిమా సంగతి పక్కన పెడితే ‘ఇద్దరి లోకం ఒకటే’ సెన్సార్ పూర్తి చేసుకుంది.. రిలీజ్ కు రెడీగా ఉంది. వీలైతే ఈ నెలలోనే విడుదల చేయాలని రాజుగారు అలోచిస్తున్నారట. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో పూర్తిగా వెనకబడి ఉంది. అసలు రాజ్ తరుణ్-దిల్ రాజు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తోందని ఎంతమంది ప్రేక్షకులకు తెలుసు?

అసలే బజ్ లేని సినిమాకు సరైన ప్రమోషన్స్ లేకపోతే ప్రేక్షకులకు ఎలా రీచ్ అవుతుంది? పెద్ద స్టార్ హీరోల సినిమాలకే మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్స్ మొదలు పెడుతుంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బజ్ పెంచే ప్రయత్నాలు చెయ్యడం లేదు. హీరోకు ఇప్పుడు క్రేజ్ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ సినిమా ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer