యాక్సిడెంట్ చేసిన రాజ్ తరుణ్?

0

ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలకు సంబంధించి మన టాలీవుడ్ సెలెబ్రిటీలు వార్తల్లో నిలుస్తున్నారు. కొందరు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతుండగా మరొకొందరు చిన్న చిన్న కేసులతో ఎలాగోలా బయటపడి హమ్మయ్య అనిపించుకుంటున్నారు. ఇప్పుడు రెండో బ్యాచ్ లో వచ్చాడు యూత్ హీరో రాజ్ తరుణ్. ఇవాళ తెల్లావుఝామున నార్సింగ్ సమీపంలో ఆల్కాపూర్ దగ్గరున్న ఔటర్ రింగ్ రోడ్ వద్ద వోల్వో కారులో ప్రయాణిస్తున్న రాజ్ తరుణ్ అదుపు తప్పి యాక్సిడెంట్ చేయడంతో అది కాస్తా పొదల్లోకి వెళ్ళిపోయి అక్కడే ఆగిపోయింది.

వెంటనే అలెర్ట్ అయిన రాజ్ తరుణ్ ఎవరికి ఏమి కాలేదని నిర్ధారించుకుని ఆలస్యం చేయకుండా వేరే ప్రత్యాన్మాయం ద్వారా ఇంటికి వెళ్ళిపోయాడట. పోలీసులకు సమాచారం అందించే లోపే రాజ్ తరుణ్ బృందం అక్కడినుంచి వెళ్లిపోవడంతో విచారణ చేపట్టిన పోలీసులకు అది హీరో స్వంత కారు కాదని ఏదో సంస్థకు చెందిన ఓ స్నేహితుడి దగ్గర తీసుకున్నాడని తేలిందట

ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బండి రిజిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్రంలోదే కావడంతో ఇది ఎవరిది అనే వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలిసింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఇద్దరి లోకం ఒకటే షూటింగ్ లో పాల్గొంటున్న రాజ్ తరుణ్ ఏ కారణంతో ఆ రోడ్ లోకి వచ్చాడనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కాకపోతే తనతో సహా స్పాట్ లో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఏదైనా సరే రాత్రి వేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హీరోలే కాదు ఎవరైనా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో ఈ ఉదంతం మరోసారి చాటి చెప్పింది. అయినా ప్రాణాల కన్నా ముఖ్యమైనవి ఏముంటాయి. అందుకే సేఫ్టీ ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్ అనేది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home