నిఖిల్ సినిమా కు పోటీ గా రాజావారు రాణిగారు!

0

యువ హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా. అయితే పలు కారణాల వల్ల సినిమా రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. అన్నీ అడ్డంకులు దాటుకుని నవంబర్ 29 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కు పెద్ద సినిమాల నుంచి పోటీ లేదు కానీ ఒక చిన్న సినిమా మాత్రం పోటీలో రిలీజ్ అవుతోంది.

‘రాజావారు రాణిగారు’ అనే సినిమా అదే రోజు విడుదల అవుతోంది. సీనియర్ నిర్మాత సురేష్ బాబు ను ఈ సినిమా కంటెంట్ మెప్పించడంతో ఆయన స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. కొత్త వారితో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ సినిమా కు బీ..సీ సెంటర్లలో గట్టి పోటీ ఇవ్వలేక పోవచ్చు కానీ ఎ సెంటర్ల లో.. మల్టిప్లెక్స్ స్క్రీన్ల లో మాత్రం పోటీ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సురేష్ బాబు రిలీజ్ చేసే సినిమాల విజయాల శాతం ఎక్కువ. దీంతో ఈ సినిమా కూడా ప్రేక్షకుల ను మెప్పించే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయని టాక్ ఉంది. మరి ఈ సినిమాతో నిఖిల్ సినిమా కు కొంత మాత్రం అయినా డ్యామేజ్ తప్పదనే ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.

‘అర్జున్ సురవరం’ పలుమార్లు వాయిదా పడిన కారణం గా ప్రేక్షకుల్లో అంతగా హైప్ రాలేదు. రిలీజ్ కు తక్కువ సమయమే ఉంది కాబట్టి స్ట్రాంగ్ ప్రమోషన్స్ తో సినిమా కు బజ్ పెంచే ప్రయత్నం చేస్తారేమో వేచి చూడాలి. తమిళ సూపర్ హిట్ ‘కనిదన్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విజయం పై నిఖిల్ చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. నిఖిల్ నమ్మకం నిజమవుతుందా లేదా తెలియాలంటే మనం ఈ నెలాఖరు వరకూ వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer