ఆ స్టాటజీనే ఫాలో అవుతున్న రాజమౌళి

0

ఎన్టీఆర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే స్టోరీ గురించి క్యారెక్టర్స్ గురించి క్లారిటీ ఇచ్చేసారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్క స్టిల్ కూడా వదలలేదు. ఎలాంటి లీక్ జరగకుండా జాగ్రత్త పడుతున్నారు కూడా.

అయితే ఈ రోజు కొమరం భీమ్ జయంతి సందర్భంగా సినిమాలో ఎన్టీఆర్ లుక్ వదులుతారని తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులంతా ఎదురుచూశారు. అయితే అలా ఎదురుచూసిన అందరినీ డిసప్పాయింట్ చేసాడు జక్కన్న. జయంతి సందర్భంగా కొమరం భీమ్ ను తలుచుకుంటూ తారక్ ను స్క్రీన్ మీద కొమరం భీమ్ గా ప్రేక్షకులకు చూపించాలని ఎగ్జైట్ అవుతున్నామని ఓ ట్వీట్ వేసి చేతులు దులుపుకున్నారు.

నిజానికి రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ఓ స్తాటజీతో వెళ్తాడు. ఎప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి..? ఎప్పుడు సినిమా కంటెంట్ ను వదలాలి అనేవి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటాడు. అభిమానుల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా పట్టించుకోకుండా తాము అనుకున్న సమయానికే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో మరో సారి అదే రుజువైంది. మరి ఈ సినిమా నుండి తారక్ – చరణ్ లుక్స్ బయటికొచ్చే దెప్పుడో ..?