ఓటిటి వైపు రాజమౌళి.. దర్శకుడిగానా లేక నిర్మాతగానా..??

0

ఈరోజుల్లో కాలం ఎలా నడుస్తుందో మనుషులు కూడా అదే బాటలో నడవాల్సిన పరిస్థితి. ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులను గమనించి ముందుకెళ్లిన వారే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నష్టాలలో మునిగిందని అందరికి తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా వూట్ లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కథ స్క్రీన్ ప్లే బాగుంటే కోట్లలో బిజినెస్ నడుస్తుండటంతో దర్శకులు నిర్మాతలు కూడా ఓటీటీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టడంతో భవిష్యత్తు వెబ్ సీరీస్ లదే అని సినీ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. సినిమాలతో పోలిస్తే వెబ్ సిరీస్ లకు పడే కష్టం తక్కువ.

ఇప్పటికే టాలీవుడ్ నుండి స్టార్ డైరెక్టర్ క్రిష్.. త్వరలో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా.. ఆహా కోసం పలు వెబ్ సిరీస్ లకు రచనా సహకారం అందిస్తున్నాడని తెలుస్తోంది. మరో దర్శకుడు తేజ ఇటీవలే ఒక ప్రముఖ సంస్థతో వెబ్ సిరీస్ ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా ఆగిపోవడంతో వెబ్ సిరీస్ వైపు రానున్నాడని టాక్. ఇలా వరుసగా పూరీ జగన్నాథ్ కూడా వెబ్ సిరీస్ ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. రాహుల్ రవీంద్రన్ కూడా వెబ్ సిరీస్ లైన్లో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ రాజమౌళి కూడా ఓటిటి వైపు వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఓటిటిలు రాజ్యం ఏలుతుండటంతో ఆయన కూడా ఇటు వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికైతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరి ఆయన ఓటిటిలోకి వస్తే దర్శకుడిగా రూపొందిస్తాడా.. లేక నిర్మాతగా కొత్తవాళ్లను పరిచయం చేస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.