ప్రభాస్ – రాజమౌళి జాయింట్ వెంచర్

0

డార్లింగ్ ప్రభాస్ .. ఎస్.ఎస్.రాజమౌళి స్నేహం గురించి తెలిసిందే. బాహుబలి సిరీస్ తో ఈ జోడీ సంచలనాలకు తెర తీసారు. ప్రస్తుతం ఆ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నారు. అయితే ఈ క్రేజును మరో కోణంలోనూ ఉపయోగించేందుకు జక్కన్న- ప్రభాస్ జోడీ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అందులో భాగంగానే ఈ జోడీ సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ కి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఇంత అకస్మాత్తుగా రాజమౌళి- ప్రభాస్ బృందం సొంతంగా బ్యానర్ ప్రారంభించడానికి కారణమేంటి? అంటే.. దానికి మీనింగ్ ఫుల్ డెఫినిషన్ అట్నుంచి వినిపిస్తోంది.

టాలీవుడ్ లో ఎందరో ప్రతిభావంతులు తమని తాము నిరూపించుకునేందుకు ఆశగా వేచి చూస్తున్నారు. ప్రూవ్ చేసుకునేందుకు సరైన అండదండల కోసం వెతుకుతున్నారు. అలాంటి వాళ్లలో మెరికల్ని ఏరి రాజమౌళి అండ్ ప్రభాస్ అవకాశాలు కల్పించే ఆలోచనలో ఉన్నారు. అందుకోసమే ప్రత్యేకించి కొత్త బ్యానర్ ని డిజైన్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే తన శిష్యులకు ఈ బ్యానర్ లో అవకాశాలు కల్పించాలని రాజమౌళి భావిస్తున్నారట.

అయితే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు. చాలా కాలంగా పలువురు అనుసరిస్తున్నదే. సూపర్ స్టార్ మహేష్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కొలీగ్స్ తో కలిసి టైఅప్ అయ్యి నవతరం ట్యాలెంటును ఎంకరేజ్ చేస్తున్నారు. మహేష్ ఇప్పటికే తన సొంత నిర్మాణ సంస్థలో పలువురు ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాలు అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి. అగ్ర నిర్మాతలు దిల్ రాజు.. అల్లు అరవింద్.. డి సురేష్ బాబు వంటి వారు ప్రత్యేకించి ప్రతిభను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అందుకోసం అవసరం మేర కొత్త బ్యానర్లను స్థాపించారు. ఇప్పుడు ప్రభాస్ అదే బాటలో పయనించేందుకు జక్కన్నతో కలిసి సంకల్పించారు. ఇక ప్రభాస్ – రాజమౌళి ఇద్దరికీ పాన్ ఇండియా లెవల్లో క్రేజు ఉంది కాబట్టి అందుకు తగ్గట్టే కొత్త బ్యానర్ కి ప్రమోషన్ పరంగా ప్రత్యేక ఐడెంటిటీ దక్కుతుందనడంలో సందేహమేం లేదు.