జక్కన్న టార్గెట్ రీచ్ కాగలడా!

0

ఈ ఏడాది అత్యధిక హైప్ తెచ్చుకున్న సినిమాలుగా పేరున్న సాహో – సైరా విడుదల కావడం సందడి ముగిసిపోవడం రెండూ జరిగిపోయాయి. సైరా థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతోంది కానీ దాదాపు వసూళ్లయితే చివరి దశకు వచ్చేసినట్టే. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి ఆర్ఆర్ఆర్ వైపుకు మళ్లుతోంది. టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ కు రెగ్యులర్ బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

ఒకసారి చరణ్ కు గాయం మరోసారి జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలు ఇంకోసారి సైరా ప్రమోషన్ల కోసం బ్రేక్ రావడం ఇలా ఎన్నో కారణాలు అడ్డం పడుతూనే వచ్చాయి. ఇప్పుడివే జక్కన్న టెన్షన్ ని రెట్టింపు చేస్తున్నాయి. గత ఏడాది ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. తీరా చూస్తే షూట్ బాలన్స్ ఇంకా చాలా ఉంది. అసలు తారక్ కు జోడి ఎవరో చరణ్ కు జంటగా నటిస్తున్న అలియా భట్ ఎప్పటి నుంచి సెట్ లో జాయిన్ అవుతుందో లాంటి వివరాలేవీ తెలియడం లేదు.

అందులోనూ ఫాంటసి మిక్స్ అయిన మూవీ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎంతలేదన్నా నాలుగైదు నెలలు వాటికి కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటి స్టేటస్ ప్రకారం షూటింగ్ పూర్తి కావడానికి మార్చ్ లేదా ఏప్రిల్ దాకా పట్టేలా ఉంది. జనవరి నుంచే పేరలాల్ గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నూరైనా ముందు చెప్పిన డేట్ కి రావడానికే రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. ఒకవేళ ఇదే నిజమైతే నిద్రలేని రాత్రిళ్ళు అలుపు మర్చిపోవాల్సిన పగళ్లు ఇకపై స్వాగతం చెబుతున్నట్టే.
Please Read Disclaimer