రిలీజ్ పై జక్కన్నలో డైలమా?

0

ఆర్.ఆర్.ఆర్ సినిమాకి సంబంధించిన రకరకాల సందేహాల్ని క్లియర్ చేసేందుకు గతంలో ప్రెస్ మీట్ పెట్టిన రాజమౌళి అప్పట్లో చాలా సందేహాలకు సమాధానాలిచ్చారు. ఆర్.ఆర్.ఆర్ కథ కూడా చెప్పేశారు. అల్లూరి సీతారామరాజు- కొమురం భీమ్ బాల్యం ఎలా సాగింది? స్వాతంత్య్ర సమరయోధులుగా మారక ముందు ఏం జరిగింది. ఆ ఇద్దరూ కలిసి ఆంగ్లేయుల్ని ఎదురించి ఉంటే ఏం జరిగేది? అన్న ఫిక్షన్ కథని ఎంచుకున్నామని తెలిపారు. ఇక మీడియా అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 30 జూలై 2020 రిలీజ్ తేదీ అని ప్రకటించారు. ఇక చాలా గ్యాప్ తర్వాత మరోసారి వేడెక్కించే విషయాల్ని వెల్లడించారు.

అయితే ఈసారి మీడియా మీట్ పెట్టకుండానే ఈ సినిమాకి సంబంధించిన కీలక క్యాస్టింగ్ వివరాల్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తారక్ సరసన ఒల్లిసన్ మోరిస్ నటిస్తుందని ఐరిష్ బ్యూటీ అలిసన్ డూడీ విలన్ గా నటిస్తుందని .. థోర్ ఫేం రే స్టీవెన్ సన్ మరో విలన్ గా సెట్టయ్యాడని ప్రకటించారు. ఆ ముగ్గురిపైనా కీలక సన్నివేశాల్ని ఇకపై చిత్రీకరించాల్సి ఉంది.

ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇక పెండింగ్ 30 శాతం పూర్తి చేసేందుకు ఇంకెంతో సమయం పట్టదు. మరో రెండు మూడు నెలల్లోనే ఆర్.ఆర్.ఆర్ పై పూర్తి క్లారిటీ వచ్చేయనుంది. ఈలోగానే డిసెంబర్ 31 మిడ్ నైట్ ఆర్.ఆర్.ఆర్ పూర్తి ఫామ్ ఏమిటి? టైటిల్ ఏం ఫిక్స్ చేశారు? అన్నది రివీల్ చేస్తారట. అప్పటికి రిలీజ్ తేదీపైనా క్లారిటీ వచ్చే వీలుందని తెలుస్తోంది. అయితే చరణ్ – ఆలియా జంటపై షూట్ ఎంత పూర్తయింది? తారక్ పై ఎంతవరకూ పూర్తి చేశారు? అతడితో ఇంకా ఎంత పెండింగ్ వగైరా వివరాలన్నీ కొత్త సంవత్సరం శుభసందర్భంగా చెబుతారనే భావిస్తున్నారు. ఇప్పటికి అయితే రాజమౌళి రిలీజ్ తేదీ గురించి ఎక్కడా చెప్పలేదు. అంటే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొందా? అంటూ అభిమానుల్లో సందేహం వ్యక్తమవుతోంది.
Please Read Disclaimer