మాట తప్పిన జక్కన్న.. మళ్లీ ట్రోల్స్

0

కొత్త సంవత్సరం సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రేక్షకాభిమానులకు ఓ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రతి పండగకి ఆర్.ఆర్.ఆర్ నుంచి తప్పనిసరిగా స్పెషల్ ట్రీట్ ఉంటుందని జక్కన్న అండ్ టీమ్ నోరు జారారు. దాంతో న్యూ ఇయర్ ట్రీట్ కోసం ఎంతగానో వేచి చూశారు. అయితే ఆ రోజున పాత పోస్టర్ కి కొత్త రంగులు వేసి అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో ఫ్యాన్స్ సీరియస్ గానే ఫైర్ అయ్యారు. బిగ్ సర్ ప్రైజ్ అంటూనే.. అభిమానులకు ఊహించని షాకిచ్చారు జక్కన్న. స్పెషల్ ట్రీట్ ఉంటుంది అని ఊరించి మరో కొత్త పోస్టర్ అయినా రిలీజ్ చేయలేదు.

జక్కన్న జిమ్మిక్ కి ఫ్యాన్స్ తీవ్ర నిరాశతో ఇప్పటికీ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ ట్రీట్ లేకపోయినా… కనీసం రిపబ్లిక్ డే ట్రీట్ అయినా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ ఆదివారం రిపబ్లిక్ డేని పురస్కరించుకుని పలువురు హీరోలకు సంబంధించిన పోస్టర్లను..అప్ డేట్స్ ను ఇచ్చారు. కానీ ఆర్.ఆర్.ఆర్ నుంచి ఎలాంటి అప్ డేట్ గానీ… కొత్త పోస్టర్ కానీ రిలీజ్ చేయలేదు. నేడు జక్కన్న టీమ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజనులు మళ్లీ ట్రోలింగ్ మొదలెట్టారు.

ఈరోజు ఇతర స్టార్లకు సంబంధించిన కొత్త విశేషాలు.. పోస్టర్లను మాతో పంచుకున్నారు. ఆర్.ఆర్.ఆర్ బృందం పెద్ద హ్యాండిచ్చిందని అభిమానులు ట్రోలర్స్ చెలరేగిపోయారు. మరికొందరు ఈ జాతీయ జెండా సీన్స్ ఏవైనా ఆర్.ఆర్.ఆర్ లో ఉన్నాయా? అంటూ ఊహించని రీతిలో ప్రశ్నల్ని సంధిస్తున్నారు. మొత్తానికి జక్కన్నకు భలే చిక్కొచ్చి పడింది. నోరు జారిన ప్రతిసారీ ఇలా అభిమానుల నుంచి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ ఫేవరెట్ స్టార్లు అయిన తారక్ – చరణ్ కొత్త లుక్ చూడాలన్న ఆత్రంలోనే ఈ కోపతాపాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అన్నిటికీ తెర దించాలంటే ముందు జక్కన్న మైండ్ లో ఏం ఉందో తెలియాల్సి ఉంటుంది. జూలై 30 రిలీజ్ అంటే.. మరో ఐదు నెలల సమయం అయినా లేదు.
Please Read Disclaimer