జక్కన్న సైలెన్స్ అందుకేనా!

0

నిన్న విడుదలైన సాహో ఫలితం కళ్ళముందు కనిపిస్తున్నా వీకెండ్ పుణ్యమా అని వసూళ్లు మంచి స్వింగ్ లో ఉండటంతో ఫ్యాన్స్ కు ఒక పక్క ఆనందంగా మరోపక్క ఇంత గొప్ప విజువల్ ట్రీట్ కు ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందే అనే బాధా రెండు ఒకేసారి కలుగుతున్నాయి. ఇదిలా ఉంచితే ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధిగా వచ్చిన రాజమౌళి ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. ట్రైలర్ ను షేర్ చేయలేదు.

పక్కరాష్ట్రం సుదీప్ నటించిన పెహల్వాన్ గురించి కొద్దిరోజుల క్రితం ప్రస్తావించిన జక్కన్న ఇప్పుడు సాహో గురించి మాత్రం ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారు అనేది అందరికి కలుగుతున్న సందేహం. ఫిలిం నగర్ టాక్ ప్రకారం సాహో ఫైనల్ కట్ రాజమౌళి ఇంతకు ముందే చూశారట. కానీ అప్పటికే ఏ చిన్న మార్పు చేయలేని స్టేజి లో పనులన్నీ అయిపోవడంతో సైలెంట్ అయ్యారని గాసిప్. ఆ కారణంగానే సాహో గురించి ఏ ఒక్క ట్వీటూ చేయలేదని వినికిడి.

అందరూ కామెంట్స్ చేస్తున్న సినిమాను తానొక్కడినే పాజిటివ్ గా పొగిడితే లేనిపోని చిక్కులు వస్తాయని అనుకున్నారేమో. లేదా బాహుబలితో అనవసరమైన పోలికలు తెచ్చి నెటిజెన్లు విసిగిస్తారని భావించారో మొత్తానికి జక్కన్న సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్నా అదో న్యూస్ అయిపోతోంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న రాజమౌళికి సాహో గురించి తెలిసే అవకాశం లేదని అతని అభిమానులు అంటున్నా జియో సిగ్నల్ ఉంటే చాలు కారడివిలో ఉన్నా కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే టెక్నాలజీ ఉన్న ట్రెండ్ లో ఈ మాటను నమ్మగలమాPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home