నెక్ట్స్ బాలీవుడ్ ను కొట్టే మగాడు ఈయనేనా?

0

బాలీవుడ్ హీరోలు చేయలేని పనిని మన ప్రభాస్ చేసేసరికి అక్కడి మీడియా – హిందీ హీరోల్లో కాసింత ఈర్ష్యా ద్వేషాలు సహజంగా తన్నుకొచ్చాయనే మాట వినిపించింది.. ఓ తెలుగోడు హిందీ మార్కెట్ లోకి వచ్చి ఇంత క్రేజ్ సంపాదించడం ఏంట్రా అని హిందీ జనాలు కొందరు ‘సాహో’ సినిమాపై ఆది నుంచి నెగెటివ్ ప్రచారం చేశారు. సాహో కొంచెం మంచి టాక్ తెచ్చుకొని ఉంటే ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిండేవాడు.. తెలుగు వారి సత్తా చాటేవాడే.. బాలీవుడ్ ను ఏలేవాడేమో.. కానీ బ్యాడ్ లక్. రివ్యూలు – పబ్లిక్ టాక్ లో సినిమాపై కాసింత నిరాశ కలిగించే మాటలే వినిపించాయి. దీంతో టాలీవుడ్ ప్రముఖులు జనాలు నిరుత్సాహ పడ్డా.. హిందీలో మాత్రం ఈ సినిమా ఆశించిన టాక్ రాకపోయేసరికి నెగెటివ్ ప్రచారం చేసిన కొందరు సంబురపడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు బాలీవుడ్ కొట్టే మగాడే ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. సాహోతో వరుసగా రెండు హిట్స్ కొట్టి దేశాన్ని ఏలేద్దామనుకున్న ప్రభాస్ ఆశలకు కాస్త బ్రేక్ పడింది. మరి నెక్ట్స్ బాలీవుడ్ లో తెలుగు వెలుగుకు రెండే దారులున్నాయి. ఒకటి ’సైరా’.. రెండోది రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’. ముందు నుంచి సైరాపై పెద్దగా అంచనాలు లేకపోవడం.. చిరంజీవికి హిందీలో ఆశించిన మార్కెట్ లేకపోవడం మైనస్ గా మారింది. దీంతో సినిమా విజయంపైనే అక్కడ చిరు ప్రస్తానం కొనసాగుతుంది. అయితే బాహుబలి మూవీ హిందీ జనాలను సర్ ప్రైజ్ చేసింది.ఈ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న రాజమౌళి మీదే తెలుగు సినీ అభిమానులందరూ ఆశలు పెంచుకున్నారు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ ను కొట్టే ఏకైక ఆశ మన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’పైనే ఉంది. రాం చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ఇటీవల సైరా ప్రమోషన్ లో భాగంగా ముంబై మీడియాకు రాంచరణ్ తెలిపారు. ఈ లెక్కన బాహుబలితో షేక్ చేసిన రాజమౌళి మరోసారి ఆర్ ఆర్ ఆర్ మూవీతో బాలీవుడ్ ను ఏమేరకు ప్రభావితం చేస్తాడు? బాహుబలిలాంటి బ్లాక్ బస్టర్ హిస్తాడా? మన తెలుగు వెలుగును బాలీవుడ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ పెంపొందిస్తాడా? అన్నది వేచిచూడాలి.
Please Read Disclaimer