తెలంగాణలోనే భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. అందుకేనా..?

0

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ ఎన్టీఆర్ జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం పూణేలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసాడు రాజమౌళి. అయితే కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లడంతో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

దాదాపు మూడు నెలల నుండి ఈ మహమ్మారి చిక్కుల్లో చిక్కుకొని సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. అంతేగాక కొత్త సినిమాలు ఏవి కూడా షూటింగ్ జరపలేదు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇవ్వడంతో మళ్లీ సినీ దర్శకనిర్మాతలు షూటింగ్ ప్రారంభించే పనుల్లో ఉన్నారు. ఇక రాజమౌళి ప్లాన్ చేసిన పూణే షెడ్యూల్ రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు షూటింగ్ ప్రారంభిద్దాం అంటే పూణేలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజమౌళి తన టీమ్ తో బయట షూటింగ్స్ ప్లాన్ చేయకుండా తెలంగాణలోనే లొకేషన్స్ వెతుకుతున్నాడట.

ముఖ్యంగా ఎన్టీఆర్ రాంచరణ్ అజయ్ దేవగన్ ల మధ్య సన్నివేశాలు చిత్రీకరించడానికి కోట అవసరం ఉందట. అందుకోసం ప్రస్తుతం రాజమౌళి టీమ్ నల్గొండ జిల్లాలో కోటను వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. పూణే షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి ఇంతవరకు అక్కడ ఒక్కరోజు కూడా షూటింగ్ చేయలేదట. ఇంకా అలియా భట్.. ఒలీవియా మోరిస్..లతో సన్నివేశాలు ప్రారంభం కాలేదని తెలుస్తుంది. ఇక ఈ పాన్ ఇండియా సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నారట.
Please Read Disclaimer