లండన్ లో బాహుబలి హంగామా

0

సాహో ఇచ్చిన షాక్ నుంచి డార్లింగ్ ప్రభాస్ కోలుకుంటున్నాడు. బాహుబలిని తిరగరాస్తుందనుకుంటే అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరాజయం పాలవ్వడం ఊహించనిది. పాన్ ఇండియా ట్యాగ్ లో నార్త్ లో అంతో ఇంతో సేఫ్ అయినప్పటికీ ఇది కోరుకున్న ఫలితం అయితే కాదు. ఇదిలా ఉండగా బాహుబలి కోసం మరోసారి టీమ్ మొత్తం లండన్ లో హంగామా చేయబోతోంది. ఈ నెల 19న లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి ప్రత్యేక స్క్రీనింగ్ వేయబోతున్నారు. ఇందులోనే కీరవాణి లైవ్ మ్యూజికల్ పెర్ఫార్మన్స్ కూడా ఉండబోతోంది.

ఇప్పటికే ఈ ఈవెంట్ తాలూకు టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుబోతున్నాయి. ప్రభాస్ అనుష్క రానా లతోపాటు దర్శకుడు రాజమౌళి నిర్మాతలు శోభు ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొనబోతున్నారు. మెమరబుల్ ఈవెంట్ గా డిజైన్ చేసిన దీనికి చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పూర్తి చేసుకుని అందరు వెనక్కు వస్తుండగా ప్రభాస్ మాత్రం 23న వచ్చే తన పుట్టినరోజు కోసం అక్కడే వేడుకలు చేసుకోబోతున్నాడు. ఇప్పటికే స్నేహితుల కోసం ఇండియా నుంచి బుకింగ్ కూడా చేశాడట.

సో డార్లింగ్ ఫ్యాన్స్ నేరుగా ప్రభాస్ ని బర్త్ డే రోజు చూసే ఛాన్స్ లేనట్టే. కొత్త సినిమా జాన్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోందో ఇంకా వివరాలు తెలియడం లేదు. దర్శకుడు రాధాకృష్ణ స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ లవ్ స్టోరీగా యూరోప్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. వచ్చే వేసవికి లేదా ఏడాది చివరికి రిలీజ్ చేసే అవకాశం ఉన్న ఈ సినిమా తాలూకు కీలకమైన అప్ డేట్ 23న వచ్చే అవకాశం ఉందిPlease Read Disclaimer