#RRR కథ వినడానికి సిద్దమవుతున్నారు

0



టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఒక్క #RRR కి సంబందించిన న్యూస్ వస్తే మాత్రం అందరూ దాని గురించే చర్చించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తరువాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్ – తారక్ హీరోలుగా కనిపించబోయే ఆ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఓ క్లారిటీలోకి వచ్చే వరకు సినిమాను పట్టాలెక్కించకూడదు అను రాజమౌళి డిసైడ్ అయ్యాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని ఓ షెడ్యూల్ ను ఇటీవల బ్యాంకాక్ లో ఫినిష్ చేశారు. చాలా రోజులుగా జరిగిన ఆ షెడ్యూల్ వలన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ రెస్ట్ తీసుకోనున్నాడు. అయితే ఆ రెస్ట్ లోనే జక్కన్న తన ఫుల్ స్క్రిప్ట్ ను వినిపించాలని అనుకుంటున్నాడట. తారక్ ఎలాగో ఇక్కడే ఉంటాడు కాబట్టి త్రివిక్రమ్ ప్రాజెక్టు కి ఓ రెండు రోజులు బ్రేక్ చెప్పే అవకాశం ఉంది. ఇక ఇద్దరు హీరోలకు కుదరకపోయినా చరణ్ కు ముందే చెప్పాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక చరణ్ కొన్ని రోజుల తరువాత మళ్లీ బోయపాటి ప్రాజెక్టు ను హైదరాబాద్ లోనే స్టార్ట్ చేయనున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. ఇక డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.