నిర్మాతగా మారనున్న రాజమౌళి తనయుడు

0

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. కానీ కొందరు మాత్రం హీరోలుగా కాకుండా బ్యాక్ ఎండ్ లో దర్శకుడిగా.. నిర్మాతగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కానీ అలాటి స్టార్ కిడ్స్ సంఖ్యను వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు ఆ లిస్టులో SS రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా చేరాడు.

తండ్రి బాటలో కార్తికేయ దర్శకత్వం చేపడతాడని గతంలో వార్తలు వచ్చాయి గానీ ఆదిశగా అడుగులు పడలేదు. తాజా సమాచారం ప్రకారం కార్తికేయ నిర్మాతగా మారుతున్నాడట. నిర్మాతగా మారాలన్న తన కోరికను తల్లిదండ్రులకు చెప్పడం.. వారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగాయట. త్వరలో కార్తికేయ కొత్త బ్యానర్ స్థాపించి సినిమాల నిర్మాణం మొదలు పెడతాడట. కార్తికేయ నిర్మించనున్న మొదటి సినిమాకు గంగరాజు అశ్విన్ దర్శకత్వం వహిస్తాడట. అశ్విన్ కు గతంలో ‘ఈగ.. ‘బాహుబలి’ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉంది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘ఆకాశవాణి’ అనే టైటిల్ అనుకుంటున్నారట.

కార్తికేయ విషయానికి వస్తే.. గతంలో ‘యుద్ధం శరణం’ కు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యహరించాడు. అంతే కాకుండా బాహుబలి ప్రొడక్షన్ సమయంలో సెకండ్ యూనిట్ ను హ్యాండిల్ చేయడం కూడా జరిగింది కాబట్టి మంచి అనుభవం ఉన్నట్టే. దీనికి తోడు రాజమౌళి ఫ్యామిలీ అంతా సినిమా పరిశ్రమకు అంకితమైన వారే కాబట్టి సపోర్ట్ కూడా భారీగానే ఉంటుంది. త్వరలో కార్తికేయ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.
Please Read Disclaimer