ప్రొఫెషనల్ డైరెక్టర్ లా చేశావ్- రాజమౌళి

0

మోస్ట్ అవైటెడ్ 2019 మూవీ `సాహో` ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో లక్ష మంది అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. దాదాపు 2కోట్ల ఖర్చుతో అత్యద్భుతంగా వేదికను సిద్ధం చేసారు. ఈ వేదిక చుట్టూ ఎటు చూసినా అభిమానుల కోలాహాలం కనిపించింది. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎస్.ఎస్.రాజమౌళి- అల్లు అరవింద్- వివి వినాయక్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వేదికపై ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్.. సుజీత్.. నిర్మాతలు ప్రమోద్ – వంశీలపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి మాట్లాడుతూ-“ప్రభాస్ ఏ రోజూ ఎవరి గురించి చెడుగా మాట్లాడడు. తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అదే అంతమంది అభిమానుల్ని తెచ్చి పెట్టింది. సాహో రిలీజ్ కి వస్తోంది. కానీ ప్రభాస్ కి దూరదృష్టి ఎక్కువ. బాహుబలి మొదలైనప్పుడే ఆ తర్వాతి సినిమా గురించి చాలా తపన పడ్డాడు. సుజీత్ వచ్చి కథ చెప్పాడు. ఫెంటాస్టిక్ గా ఉంది డార్లింగ్ అని నాకు ఆ కథ గురించి చెప్పాడు. బాహుబలి తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయాలని అనలేదు. అతడు సుజీత్ చెప్పిన కథను నమ్మి ఈ సినిమా చేశాడు. బాహుబలి తర్వాత ఇలాంటి సినిమా అయితేనే జనాలకు నచ్చుతుంది.. ఫ్యాన్స్ కి నచ్చుతుందని నమ్మి చేశాడు“ అని తెలిపారు.

“సుజీత్ చాలా తక్కువ వయసు. చిన్న పిల్లాడు. చాలా మంది డౌట్లు పడ్డారు. ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయగలడా? అని అన్నారు. సాహో టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ తో పూర్తిగా అర్థమైపోయింది సుజీత్ సమర్థత ఏంటో? కంగ్రాట్యులేషన్స్ సుజీత్. ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా చేశావ్. ఇదేమీ అంత సులువైన జాబ్ కాదు. అంత పెద్ద టెక్నీషియన్స్ ని.. అంత పెద్ద బడ్జెట్ ని.. హ్యాండిల్ చేశావ్. ప్రొఫెషనల్ గా చేశావ్“ అని దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. నిర్మాతల గురించి ప్రస్థావిస్తూ..“ వినాయక్ అన్నట్టుగానే నిర్మాతలకు పులులు- సింహాలకు ఉండే గుండె ఉంది. ప్రభాస్ అంటే ఇష్టంతో ఏదైనా చేసేస్తారు. ఆగస్టు 30న రాకింగ్. అంతకుమించి సాహో చేస్తుంది. నిర్మాతలకు డబుల్ ట్రిపుల్ లాభాలు రావాలి. ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్. అతడిని అంతకుమించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. గ్రాఫిక్స్ .. సెట్స్ గురించి నాకు తెలుసు. సాబు సిరిల్ ఎన్నో సెట్లు వేశామని చెప్పారు. ప్రతిదీ బాగా కుదిరాయి. సాహో సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది“ అన్నారు.
Please Read Disclaimer