లొకేషన్ల వేటలో రాజమౌళి టీమ్.. అదే జిల్లాలో!

0

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. స్టార్ హీరోలు రాంచరణ్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆయనకు తోడుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభిస్తారని.. పూణే షెడ్యూల్లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం పూణే షెడ్యూల్ కాన్సల్ చేసి తెలంగాణలోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి టీమ్. ఈ సినిమా షూటింగులో అలియా భట్ ఒక్కరోజు కూడా పాల్గొనలేదు. ఇక ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.

దాదాపు మూడు నెలల నుండి ఈ మహమ్మారి చిక్కుల్లో చిక్కుకొని సినిమాల షూటింగ్స్ అన్నీ నిలిచిపోయి.. కొత్త సినిమాలేవి షూటింగ్ జరపలేదు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో మళ్లీ సినీ దర్శకనిర్మాతలు షూటింగ్ ప్రారంభించే పనుల్లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ముఖ్యంగా చారిత్రక సన్నివేశాలు మధ్య చిత్రీకరించడానికి కోట అవసరం ఉందట. అందుకోసం ప్రస్తుతం రాజమౌళి టీమ్ నల్గొండ జిల్లాలో లొకేషన్ వేటలో ఉన్నట్లు సమాచారం. పూణే షెడ్యూల్ ప్లాన్ చేసినప్పటికి ఇంతవరకు అక్కడ ఒక్కరోజు కూడా షూటింగ్ చేయలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ప్రారంభం అవుతుందట. ఇక ఈ పాన్ ఇండియా సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల సెకండ్ హాఫ్ లో విడుదల కానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.