సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

చరణ్ ను సున్నితంగా హెచ్చరించిన జక్కన్న?

0

ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం భారీస్థాయిలో ‘RRR’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ మొదటి నుంచి పూర్తిస్థాయిలో సమయం కేటాయించారు. సినిమా ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మరో పని పెట్టుకోలేదు. కానీ చరణ్ మాత్రం మొదటి నుంచి పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేకపోయారు.

‘RRR’ షూటింగ్ పోయినేడాది ప్రారంభం అయితే ఆ సమయంలో చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ‘RRR’ లో నటించడంతో పాటుగా ‘సైరా’ నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి రావడంతో నిన్న మొన్నటివరకూ చరణ్ అటు ‘సైరా’ ఇటు ‘RRR’.. రెండు ప్రాజెక్టులకోసం తన టైం ను బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ‘సైరా’ రిలీజ్ అయింది.. హడావుడి తగ్గింది అనుకుంటే దసరాకు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాను లాంచ్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ కూడా ఒక నిర్మాత. దీంతో రాబోయే రోజుల్లో కూడా చరణ్ పూర్తి స్థాయిలో ‘RRR’ కు తన సమయం కేటాయించే పరిస్థితి లేదు. దీంతో రాజమౌళి సున్నితంగా చరణ్ ను హెచ్చరించారనే టాక్ వినిపిస్తోంది.

‘RRR’ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని డేట్ కూడా ప్రకటించారు. అయితే ‘RRR’ సినిమాకు కొన్ని ఊహించని అవాంతరాలు ఎదురు కావడంతో షూటింగ్ ఇప్పటికే కాస్త డిలే అయింది. చరణ్.. తారక్ లు గాయాల పాలు కావడం.. బ్రిటిష్ నటి తప్పుకోవడం లాంటి వాటివల్ల ఈ డిలే జరిగింది. అయితే రాజమౌళి ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమాను చకచకా పూర్తిచేయాలని అనుకుంటున్నారట. దీంతో ఈ సినిమాపై మరింత శ్రద్ధ పెట్టాలని చరణ్ ను కోరాడని అంటున్నారు.
Please Read Disclaimer