శివాని.. హాట్ గ్లామర్ రూట్

0

డా.రాజశేఖర్ – జీవితల పెద్ద కుమార్తె శివాని డెబ్యూ సినిమా చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా డిలే అయింది. ఇంతలో రెండవ కుమార్తె శివాత్మిక డెబ్యూ చిత్రం ‘దొరసాని’ రిలీజ్ కూడా అయింది. తెలుగు తెరకు శివాని ముందుగా హీరోయిన్ గా పరిచయం కావాల్సి ఉన్నా శివాత్మికే ముందు పరిచయం అయింది. శివాని ఇంకా తన డెబ్యూ చిత్రం కోసం ఎదురు చూస్తూ ఉంది.

అయితే తన మొదటి సినిమా రిలీజ్ అయ్యే లోపే తనను అందరూ గుర్తించాలని అనుకుందేమో కానీ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ బాలీవుడ్ స్టార్ కిడ్స్ బాటలో నడుస్తోంది. బాలీవుడ్ లో ఎంతపెద్ద ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్ కిడ్స్ అయినా గ్లామర్ విషయంలో అస్సలు తగ్గరు. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు శివాని తన గ్లామర్ షూట్ తో ఆ ట్రెండ్ ను మారుస్తోంది. తాజాగా శివాని తన ఇన్స్టా ఖాతా ద్వా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫీల్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో శివాని పీచ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించింది. థై స్లిట్ ఉండడంతో కాళ్ళ అందాలు బైట పడ్డాయి. ఇయర్ రింగ్స్ తప్ప పెద్దగా యాక్సెసరీస్ ధరించకుండా ఒక సూపర్ మోడల్ తరహాలో సూపర్ పోజులిచ్చింది. శివాని ట్రెండ్ చూస్తుంటే తెలుగులో స్టార్ కిడ్స్ కు గ్లామర్ విషయంలో ఒక స్టాండర్డ్ సెట్ చేసేలా ఉంది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. “బాండ్ గర్ల్ లా ఉన్నావు”.. “సినిమా కోసం వెయిటింగ్ ఇక్కడ”.. “బాలీవుడ్ హీరోయిన్ లా ఉన్నావు” అంటూ కామెంట్లు పెట్టారు. శివాని గ్లామర్ హీట్ ఇలానే కొనసాగితే త్వరలో కొత్త సినిమా ఆఫర్లు రావడం ఖాయమే.
Please Read Disclaimer