స్టార్ డాటర్ రఫ్ఫాడించిందంతే

0

నటవారసుల వెల్లువ అన్ని పరిశ్రమల్లో అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రతియేటా అరడజను పైగానే నటవారసులు తెరకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యూటీస్ వారసత్వ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు పడుతున్న తపన చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే పోటీ ప్రపంచంలో ఏదైనా అంత ఈజీనా? అందరిలో తమ ప్రత్యేకత ఏమిటో నిరూపించుకోకపోతే అంతే సంగతి.

పోటీని ఇట్టే పసిగట్టేసిన జాన్వీ- అహనా పాండే- సారా అలీఖాన్- సుహానా ఖాన్ వంటి నటవారసురాళ్లు తమ ప్రత్యేకతను నిలుపుకునేందుకు ప్రయత్నం చూస్తున్నదే. ఇన్ స్టా- సామాజిక మాధ్యమాల్లో హీటెక్కిస్తున్నారు. నిరంతర ఫోటోషూట్లతో అభిమానుల కళ్లను సామాజిక మాధ్యమాలకు కట్టేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ వారసురాళ్లు ఈ రేసులోకి వచ్చినట్టే కనిపిస్తోంది. రాజశేఖర్ కుమార్తెలు శివానీ-శివాత్మిక పరిశ్రమలో కథానాయికలుగా లక్ చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ భామలిరువురూ వరుస ఫోటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో గ్లింప్స్ ని అభిమానులకు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

ఆ ఇద్దరిలో శివాత్మిక ఇంకాస్త అడ్వాన్స్ డ్ ట్రీట్ తో అభిమానుల్ని అలరించేందుకు ప్రిపేర్డ్ గా ఉందని అర్థమవుతోంది. తాజాగా శివానీ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఫ్యాన్స్ ని వేడెక్కిస్తోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ స్లిట్ డ్రెస్ లో శివానీ ఇచ్చిన ఫోజు కుర్రాళ్లలో మంటలు పుట్టిస్తోంది. ఆ థై స్లిట్ లుక్ యూత్ ని వేడెక్కిస్తోంది. ముఖ్యంగా తెలుగమ్మాయిల్లో ఈ తెగువ ఇటీవలి కాలంలో చూసిందేం లేదు. నెమ్మదిగా మార్పు వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇక శివాత్మిక నటించిన దొరసాని ఆశించినంత విజయం సాధించకపోయినా ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ప్రస్తుతం రెండో సినిమాలో నటిస్తోంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఏదీ ఇటీవల రివీల్ కాలేదు. మరోవైపు శివాత్మిక అక్క శివానీ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. అన్నిటి నుంచి బయటపడి స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు శివానీ ప్రయత్నిస్తూనే ఉంది. 2 స్టేట్స్ రీమేక్ అనూహ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యింది. అయినా నిరాశ చెందకుండా మరో ప్రయత్నం చేస్తోందట. అక్కా చెల్లెళ్ల కెరీర్ టేకాఫ్ ఎప్పుడో కాస్త వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer