యాంగ్రీ స్టార్ ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి

0

సినిమాలన్న తర్వాత కామెడీ కామన్.. కొన్ని చోట్ల నిజ జీవితంలోని వ్యక్తులపై సెటైర్లు వేయడం కామన్. అయితే వీటితో వచ్చిన చిక్కేమిటంటే ఎవరిపై సెటైర్లు వేస్తారో వారికి.. వారి ఫ్యాన్సుకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. మిగతా అందరికీ అది కామెడీ. ‘గబ్బర్ సింగ్’ అంత్యాక్షరిలో పవన్ కళ్యాణ్.. అలీ కలిసి రాజశేఖర్ మీద వేసిన సెటైర్ సూపర్ గా పేలింది. ఆ విషయంపై రాజశేఖర్ – జీవిత అప్సెట్ అయ్యారు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో వారు ఓపెన్ గానే ఈ విషయాన్ని చెప్పారు.

అయితే తాజాగా రాజశేఖర్ చిత్రం ‘కల్కి’ లో అదే ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ డైలాగ్ ను రివర్స్ స్టైల్ లో కౌంటర్ వేయడం.. ‘గబ్బర్ సింగ్’ యాక్టర్ నే ఈ సినిమాలో కూడా నటింపజేయడంతో మరో సారి హాట్ టాపిక్ అయింది. ఈ సీన్లో రాజశేఖర్ ఆ నటుడికి ఒక్కటిచ్చి లెక్క సరిచేశారు. ‘కల్కి’ లో ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి డైలాగ్ రెండు సార్లు రిపీట్ అయింది.. కామెడీ కూడా వర్క్ అవుట్ అయింది. కానీ రాజశేఖర్ మాత్రం ఈ సీన్ విషయం వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “ఆ డైలాగ్ మొదటి సారి చెప్పే సమయంలో అదే నాదే అని నాకు తెలియదు. కానీ అదే డైలాగ్ రెండోసారి చెప్పే సమయంలో జీవిత అక్కడే ఉండడంతో తను నాకు ఆ సంగతి గుర్తు చేసింది. ఆడియన్స్ ఆ డైలాగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు” అంటూ అదేమీ పెద్దగా పట్టించుకోవాల్సినది కాదన్నట్టుగా తేల్చారు. అది జస్ట్ రీల్ ఫన్.. జస్ట్ కాసిన్ని నవ్వుల కోసమే. అంతకంటే పెద్దది చేయాల్సిన పనే లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-