రాజశేఖర్ సంస్కార హీనులు అన్నది ఎవరిని?

0

యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుండి చిన్న గాయం కూడా లేకుండా బయట పడ్డాడు. కారు పరిస్థితి ని చూస్తే అందు లో ఉన్న వారికి ఖచ్చితం గా పెద్ద గాయాలు అయ్యి ఉంటాయనిపిస్తుంది. కాని రాజశేఖర్ మాత్రం యాక్సిడెంట్ అయిన కొన్ని గంటల్లోనే మీడియా ముందు కు వచ్చి తాను బాగున్నాను.. నా గురించి బాధ పడ్డ వారికి భయపడ్డ వారికి కృతజ్ఞతలు అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. రాజశేఖర్ యాక్సిడెంట్ విషయం తెలిసిన వెంటనే చాలా మంది వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

కొందరు మాత్రం రాజశేఖర్ యాక్సిడెంట్ గురించి అస్సలు స్పందించ లేదట. వారి గురించి రాజశేఖర్ స్పందిస్తూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. ఈమద్య టాలీవుడ్ లో దారుణమైన కల్చర్ మొదలైంది. తోటి వారు చచ్చి పోయినా కూడా పట్టించుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటూ వెళ్తున్నారు. తోటి మనుషుల ను గురించి పట్టించుకోకుండా మరీ సంస్కార హీనులు అవుతున్నారు. ఒక తోటి నటుడు యాక్సిడెంట్ కు గురయ్యాడనే విషయం పై స్పందించని ఇండస్ట్రీ వారి గురించి రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

మీడియా లో రాజశేఖర్ కు పెద్ద యాక్సిడెంట్ జరిగింది.. ఆయనకు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డాడు అంటూ చెప్పడం తో పాటు విషయం గురించి వెంటనే జీవిత స్పందించడం తో పాటు కుటుంబ సభ్యులు స్పందించడం ఆ తర్వాత రాజశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం వంటివి జరిగిన తర్వాత ఆయన్ను పరామర్శించాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

చిన్న పాటి గాయాలు లేదా పెద్ద గాయాలు ఏమైనా అయితే అప్పుడు ఆయన్ను పరామర్శించడం లేదంటే ఆయన గురించి మాట్లాడటం చేస్తారు. అంతా బాగున్నప్పుడు స్పందించాల్సిన అవసరం ఏంటీ.. ఇంతోటి దానికే సంస్కార హీనులు అంటూ పెద్ద మాట వాడాలా రాజశేఖరా.. అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer