మహేష్ నేను ‘టామ్ అండ్ జెర్రీ’

0

కొన్ని సినిమాలో కొందరు దర్శకులకు మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. కొందరు దర్శకులు వారు ఇష్టపడే నటులతో తమ సినిమాల్లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయించుకుంటూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. దర్శకుడు అనీల్ రావిపూడి అదే కోవలోకొస్తాడు. రాజేంద్ర ప్రసాద్ ని అమితంగా ఇష్టపడే ఈ దర్శకుడు తన ప్రతీ సినిమాలో ఆయనతో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయించుకుంటాడు.

‘సుప్రీమ్’ లో రాజేంద్ర ప్రసాద్ తో కామెడీ – ఎమోషన్ తో ఉండే ఓ పాత్ర చేయించాడు. ఇక ‘F2’సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ కి కీలకమైన పాత్రే ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే రెండు భాగంలో సినిమాను నడిపించే కామెడీ పాత్ర ఇచ్చాడు. దానికి సీనియర్ హీరో మంచి న్యాయం చేసి సినిమా విజయంలో భాగం అయ్యాడు.

అయితే ఇప్పుడు మహేష్ తో చేస్తున్న సరిలేరు నీకెవ్వరులో కూడా రాజేంద్ర ప్రసాద్ కి ఓ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇచ్చాడట అనిల్. ఇటివలే సినిమాలో తన పాత్ర బాగుంటుందని ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను మహేష్ సినిమాలో టామ్ అండ్ జెర్రీ లా కనిపిస్తామని అన్నాడు. అంతే కాదు అల వైకుంఠపురములో కూడా పోలిస్ పాత్ర చేస్తున్నాని మళ్ళీ జులై లాంటి పాత్ర అని చెప్పాడు. సో సంక్రాంతి పోటిలో నిలిచిన రెండు పెద్ద సినిమాల్లో పెద్ద పాత్రలు పోషిస్తున్నడన్నమాట నట కీరిటి.
Please Read Disclaimer