సీనియర్ సూపర్ స్టార్స్ అంతా వచ్చే ఏడాదే

0

ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినా కూడా స్టార్ హీరోల సినిమాలు ఇంకా ప్రారంభం కాలేదు. కొందరు యంగ్ హీరోల సినిమాలు ఈ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. సీనియర్ హీరోల సినిమాలు ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. సీనియర్ స్టార్ హీరోలు ముఖ్యంగా ఆరు పదుల వయసుకు దగ్గరగా ఉన్నారు.. ఆరు పదుల వయసు దాటిన వారు షూటింగ్స్ కు హాజరు అయ్యేందుకు ఆందోళన చెందుతున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాదిలో కెమెరా ముందుకు వచ్చేది లేదని తేల్చి చెప్పాడు. 2021 సంవత్సరంలోనే షూటింగ్ లో పాల్గొంటానంటూ ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం యూనిట్ సభ్యులకు క్లారిటీగా చెప్పేశాడట. కేవలం రజినీకాంత్ మాత్రమే కాకుండా దాదాపు అందరు సీనియర్ హీరోలు అంతా కూడా వచ్చే ఏడాది వరకు కూడా కెమెరాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున వంటి తెలుగు స్టార్స్ కూడా ఇప్పట్లో షూటింగ్ కు హాజరు అయ్యేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు వెయిట్ చేయడం లేదంటే వచ్చే ఏడాదిలో షూటింగ్ లో పాల్గొనడం చేయాలని అనుకుంటున్నారట. వైరస్ కు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే షూటింగ్ కు జాయిన్ అవ్వాలనేది కొందరు ఆలోచనట.

అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఈ ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. కనుక 2021 సంవత్సరం వరకు ఆగి ఆ తర్వాత షూటింగ్ లో జాయిన్ అయితే నష్టమేమీ లేదు అంటూ సీనియర్ స్టార్ హీరోలు భావిస్తున్నట్లుగా ఉన్నారు.