వైరల్: దర్బార్ లో రజనీ పోలీస్ లుక్

0

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత రజనీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఫోటో లీక్ అయింది.

ఈ లీక్డ్ ఫోటోలో పోలీస్ యూనిఫామ్ లో ఉన్న రజనీ ఒక నది ఒడ్డున అలా స్టైల్ గా నడుస్తూ వస్తున్నారు. గడ్డం లుక్.. హెయిర్ స్టైల్ యంగ్ రజనీకాంత్ లుక్ ను గుర్తు తెస్తున్నాయి. ఈ ఫోటో ఇంటర్నెట్ లోకి రావడం ఆలస్యం వైరల్ గా మారిపోయింది. ఈ సినిమా షూటింగ్ లోకేషన్స్ నుండి ఫోటోలు ఇలా లీక్ కావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా రజనీ.. నయనతార ఉన్న ఫోటోలు లీకయ్యాయి. ఫిలిం యూనిట్ ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ లీక్స్ బెడద ‘దర్బార్’ టీమ్ ను వేధిస్తూనే ఉంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నివేద థామస్ మరో కీలక పాత్ర నటిస్తున్నా ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer