దర్బార్.. పూర్తిచేసిన సూపర్ స్టార్!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ – ఎఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్’. ఇప్పటికే ఈ సినిమాలో రజనీ పోలీసు గెటప్ కుసంబంధించిన ఫోటోలు ప్రేక్షకులను మెప్పించాయి. రజనీ చాలా సంవత్సరాల తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగిస్తోంది.

తాజాగా ఈ సినిమానుండి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రజనీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారట. పోయినేడాదిలో షూటింగ్ ప్రారంభించుకున్న’దర్బార్’ ఇప్పుడు చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం.

ఈ సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. నివేద థామస్.. యోగిబాబు.. ప్రతీక్ బాబ్బార్.. నవాబ్ షా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer