‘సైరా’ కోసం సూపర్ స్టార్ బరిలోకి?

0

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా నరసింహారెడ్డి` మేకింగ్ వీడియో కొన్ని గంటల క్రితమే రిలీజైంది. మేకింగ్ వీడియో తోనే సినిమా కంటెంట్ రిచ్ నెస్ కనిపిస్తోంది. ప్రేక్షకాభిమానుల అంచనాలు మించి సైరాని ఎంతో క్వాలిటీతో రూపొందించారని ప్రశంసలొస్తున్నాయి. టీజర్ తర్వాత మళ్లీ మేకింగ్ ఒక్కసారిగా అంచనాలు పెంచింది. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడమే ధ్యేయంగా నిర్మాత చరణ్ ప్రచారం పరంగా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లే ధ్యేయంగా బరిలో దిగుతున్నారని అర్థమవుతోంది.

తెలుగులో పాటు తమిళ్ – హిందీ – మలయాళం భాషల్లోనూ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ప్రచారం విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకెళ్లాలనుకుంటున్నారు. సినిమా రీచ్ ను పెంచడానికి వీలున్న మార్గాలన్నింటిని అనుసరిస్తున్నాడు. దీనిలో భాగంగా తమిళ్ ట్రైలర్ రిలీజ్ కోసం ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నే రంగంలోకి దించాలని చూస్తున్నాడట. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం లో ఉంది.

ఆ కార్యక్రమం పూర్తికాగానే కోలీవుడ్ లో మరో ఈవెంట్ ను నిర్వహించి రజనీకాంత్ ను అతిధిగా ఆహ్వానించి ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న్నట్లు కొణిదెల కాపౌండ్ వర్గాల నుంచి లీకైంది. చిరుకి స్నేహితుడు రజనీ సాయం చేస్తారని అంతా భావిస్తున్నారు. మార్కెట్ పరంగా చూస్తే చిరుకు కోలీవుడ్ లో అంత క్రేజ్ లేదు. తమిళ తంబీలకు స్థానికత.. భాషాభిమానం ఎక్కువ కాబట్టి చిరు అక్కడ మార్కెట్ ను అందుకోలేకపోయారు. అందుకే సూపర్ స్టార్ ని రంగంలోకి దించడం ద్వారా సైరాకు క్రేజ్ ని తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో చిరు పేరిట అభిమాన సంఘాలున్న సంగతి తెలిసిందే. అలాగే ఓవర్సీస్ లోనూ ప్రత్యేకించి మెగాభిమాన సంఘాలు ఉన్నాయి. సైరా చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు.




Please Read Disclaimer