Man vs Wild: రజినీకాంత్‌కు గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

0

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన అడ్వెంచరస్ షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయమైనట్టు తెలుస్తోంది. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్‌లో ఈ ప్రోగ్రామ్ షూట్ జరుగుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారు.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి రజినీ ఈ ప్రాజెక్ట్ చేస్తుండగా.. రజినీకాంత్ సోమవారమే కర్ణాటక బందిపూర్‌కి చేరుకుని షూట్‌లో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే కర్ణాటక అటవీ శాఖ అధికారులనుండి షూటింగ్‌కి పర్మిషన్ ఉండగా.. రజినీకాంత్ ఈలోపే గాయాలపాలయ్యారు. అయితే రజినీకాంత్ చేతికి మాత్రమే గాయమైందని.. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.




Please Read Disclaimer