చిరు పార్టీలో టాప్ 4 స్టార్స్ మిస్సింగ్

0

ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ పార్టీ ప్రస్తుతం టీ-టౌన్ లో హాట్ టాపిక్. మెగాస్టార్ కొత్త ఇంటి ప్రవేశం…. ఆ ఇంట్లోనే టాప్ 40 స్టార్స్ పార్టీ అదిరిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ శనివారం సాయంత్రం నుంచి మెగాస్టార్ నూతన గృహం తారల సందడితో కళకళలాడిందని తెలుస్తోంది. ప్రతిసారీ చెన్నయ్ సహా పలువురు స్టార్ల ఇళ్లలో ఎయిటీస్ స్టార్స్ రీయూనియన్ మీట్ జరిగేది. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఈ పార్టీని స్పెషల్ గా హోస్ట్ చేశారు.

కొత్త ఇంటి ప్రవేశం వేళా విశేషం.. ఇదే ఇంటిని తారలందరికీ చూపించేందుకు ఈ పార్టీని స్పెషల్ గా ఎరేంజ్ చేశారట మెగాస్టార్. చిరు కొత్త ఇంట్లో సౌత్ ఇండియా ఎయిటీస్ టాప్ స్టార్స్ అంతా గెట్ టు గెదర్ కి అటెండయ్యారు. చిరంజీవి స్వయంగా తారలందరినీ ఆహ్వానించారు. ఆయనే స్వయంగా తన కొలీగ్స్ కి వడ్డించడమే గాక.. పానీయాల్ని సర్వ్ చేసారట. అనంతరం నాటి జ్ఞాపకాలను నెమర వేసుకుని తారలంతా ఆనందంలో మునిగి తేలారు. తమిళ- కన్నడ- మలయాళ రంగాల నుంచి దాదాపు 40 మంది ఈ పార్టీకి హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ ఈ వేడుకలకు ఎటెండయ్యారు.

చిరంజీవి తో పాటు వెంకీ-నాగార్జున లాంటి నహచర స్టార్లు హాజరయ్యారు. కానీ నటసింహ బాలకృష్ణ ఎందుకనో ఈసారి పార్టీకి మిస్సయ్యారు. మెగాస్టార్ పార్టీకి నుంచి రిలీజ్ చేసిన ఆ గ్రూప్ ఫోటోలో బాలయ్య ఎక్కడా కనిపించలేదు. గతంలో ఏర్పాటు చేసి పార్టీల్లో మిస్ కాకపోయినా ఈసారి ఎందుకనో మిస్సయ్యారు. అలాగే ఈ వేడుకలో మరో వెలితి కొట్టొచ్చినట్టు కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్- విశ్వనటుడు కమల్ హాసన్ ప్రతిసారీ ఈ ఈవెంట్ కి తప్పనిసరిగా హాజరయ్యేవారు. కానీ ఈసారి ఆ ఇద్దరూ మిస్సయ్యారు. బహుశా ఆ ఇద్దరూ సినిమా షెడ్యూల్స్ తో పాటు రాజకీయాల హడావుడిలో ఉండడం వల్ల రాలేకపోయారని భావించవచ్చు. చెన్నయ్ వెన్యూ కాకుండా హైదరాబాద్ వెన్యూ కావడం ఆ ఇద్దరికీ ఇబ్బంది అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే ఈ వేడుకలో హీరో రాజశేఖర్ మిస్సయ్యారని గ్రూప్ ఫోటో చెబుతోంది. అలాగే మా అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవిత రాజశేఖర్ పార్టీలో మిస్సయ్యారని గ్రూప్ ఫోటో చూస్తే అర్థమవుతోంది.
Please Read Disclaimer