70 ఏళ్ల వయసు లో తన ఎనర్జీ సీక్రెట్ రివీల్ చేసిన రజనీ

0

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అందరికి చేతనయ్యే విషయం కాదు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న తర్వాత కూడా ఏ మాత్రం ఇజం ప్రదర్శించకుండా ఉండటం..ఒదిగా ఉండటం.. తన తీరుతో మనసుల్ని కట్టి పడేసేలా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి సవాళ్ల ను సింఫుల్ గా అధిగమించే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఒక సీక్రెట్ ను రివీల్ చేశారు.

70 ఏళ్ల వయసు లోనూ ఏ మాత్రం తగ్గని ఉత్సాహంతో వెండితెర మీద వెలిగిపోయే ఆయన.. తాజాగా దర్బార్ చిత్రం తో రానున్నారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. సంక్రాంతి సీజన్ లో తొలుత రిలీజ్ కానున్న సినిమా గా దీన్ని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీ చాలాకాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.

70 ఏళ్ల వయసులో సరిగా నడవలేని వారిని చాలామందిని చూస్తుంటాం. అలాంటిది..అందుకు భిన్నంగా ఆడిపాడి.. యాక్షన్ తో మెప్పించటం అంత తేలికైన విషయం కాదు. మరి.. రజనీకి ఇంత ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తోంది? ఆయన్ ఎనర్జీ సీక్రెట్ ఏమిటన్న విషయాన్ని తాజాగా ఆయనే రివీల్ చేశారు. ఇంత పెద్ద వయసులోనూ తానంత హుషారుగా ఉండటానికి కారణాన్ని ఆయన మాటల్లోనే చెబితే..

‘‘70 ఏళ్లు వచ్చాయి. ఇంకా హీరో గా నటిస్తున్నానంటే కారణం ప్రేక్షకుల అభిమానం.. ప్రోత్సహమే. అదే శక్తినిస్తోంది. ఇంత ఉత్సాహంగా.. సంతోషం గా ఎలా? అని అడుగుతుంటారు. తక్కువగా ఆశ పడండి. తక్కువగా భోజనం చేయండి. తక్కువ గా నిద్రపొండి. తక్కువగా వ్యాయామం చేయండి. తక్కువగా మాట్లాడండి. ఇవన్నీ చేస్తే సంతోషం గా.. ఆరోగ్యం గా.. హుషారు గా ఉంటాం’’ అని చెప్పారు. ఏదైనా మితంగా ఉండాలని.. అంతకు మించకూడదన్న విషయాన్ని ఎంత సింపుల్ గా చెప్పారు కదా?
Please Read Disclaimer