సూపర్ స్టార్’ని హడలెత్తించిన ఆకతాయి దొరికేసాడు!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానులను కలిగి ఉన్నాడు. తలైవా సినిమా వస్తుందంటే దక్షిణ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతం కూడా ఈల వేసి గోల చేస్తుంది. ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో సినిమా రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్ల దగ్గర సందడి చూస్తే మనకు అర్ధమవుతుంది. అలాంటి రజినీకాంత్ను చూసేందుకు అభిమానులు ఎక్కడికైనా భారీ సంఖ్యలో తరలివస్తారు. అయితే తాజాగా సూపర్ స్టార్ ఇంట్లో బాంబ్ అంటూ కలకలం రేపడంతో సినీవర్గాలతో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తలైవా ఇంట్లో బాంబ్ ఉన్నట్లు భద్రతా సిబ్బందికి సమాచారం రావడంతో వారు వెంటనే బాంబ్ స్క్వాడ్కు తెలియజేసి అలర్ట్ అయ్యారు. ఇక రజినీ ఇంటి ఆవరణ మొత్తం దున్నేశారు. చివరికి ఎలాంటి బాంబ్ లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి చేసిన పని అయ్యి ఉంటుందని అంతా అనుకున్నారు.

సూపర్ స్టార్ ఇంట్లో బాంబ్ అని ఎవరో ఆకతాయిలు ప్రాంక్ చేసి ఉంటారని అంచనా వేసి.. ఇలాంటివి మళ్లీ రిపీట్ అయితే మాములుగా ఉండదని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. తక్షణమే ఈ బాంబ్ గేమ్ ఆడిన వ్యక్తులను పట్టుకుని తగిన శిక్ష విధిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చి గాలింపు మొదలు పెట్టారు. అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చింది. ఎవరు చేశారు.. ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు పటిష్టమైన విచారణ చేపట్టారు. ఆశ్చర్యకరంగా పోలీసుల విచారణలో.. కడలూరు జిల్లాలోని నెల్లికుప్పం ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదో తరగతి చదువుతున్న 13యేళ్ళ బాలుడు ఈ ఆకతాయి పని చేసాడని గుర్తించారు. అయితే ఆ బాలుడు మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్య బృందం తెలిపింది. ఆ బాలుడిని విచారణ చేసిన అనంతరం వదిలిపెట్టినట్లు సమాచారం. మొత్తానికి బాంబ్ పుకారరు సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కి.. సినీ వర్గాలను హడలెత్తించింది.
Please Read Disclaimer