కూతురుతో కలిసి ఫోటోకి పోజిచ్చిన సూపర్ స్టార్..!!

0

కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచం మొత్తం గజగజ వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా విదేశాలన్నింటిని వణికిస్తోంది. అంతేగాక ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన దేశంలో లాక్డౌన్ సడలింపులు అమలులో ఉన్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు బీదా గొప్ప.. ఆడా మగా తేడా లేకుండా అందరు ఆసుపత్రి పాలవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు అన్నీ పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమలు కూడా స్థంభించిపోయాయి. ఈ వైరస్ ధాటికి సమస్తం షూటింగ్స్ సహా సమస్తం బంద్ అయ్యాయి. ప్రభుత్వాలు అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ ఎఫెక్ట్ కారణంగా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటికే పరిమితమయ్యారు.

ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా లాక్ డౌన్లో ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్నాడు. దాదాపు నాలుగు నెలల నుండి సూపర్ స్టార్ ఎలాంటి సినిమాలు.. షూటింగ్స్ లేక తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ప్రస్తుతం అన్నతే సినిమాలో నటిస్తున్నాడు రజినీ. ఆయన ఇప్పుడైతే చెన్నై శివారులోని కేలంబాక్కం ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. ఇక ఖాళీ సమయం దొరికిందని రజినీ ఓటిటిలో సినిమాలు.. వెబ్ సిరీస్లు చూస్తున్నాడట. చాలా గ్యాప్ తర్వాత రజినీ తన కూతురు ఐశ్వర్యతో కలిసి కనిపించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇద్దరు కలిసి ఫోటోకి పోజిచ్చారు. రజినీ ఆయన కూతుర్లతో ఎప్పుడు ఫోటోకి పోజిచ్చినా అది అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఇద్దరు కూడా జాతీయ జెండా గుర్తులను వారి గుండెల పై ధరించి చిరునవ్వుతో కనిపిస్తున్నారు. ఆ పిక్ చూస్తూ సూపర్ స్టార్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.