తమన్నాను ఫ్రీగా వాడేస్తున్నాడట

0

నిన్న ప్రేక్షకుల ముందుకు ‘రాజు గారి గది 3’ వచ్చింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అశ్విన్ బాబు హీరో గా నటించగా హీరోయిన్ గా అవికా గౌర్ నటించింది. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొత్తగా ఏమీ లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తూన్నారు. పూర్తి ఫలితం ఏంటీ అనేది తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో మొదట అవికాకు బదలుగా తమన్నాను తీసుకోవడం జరిగింది. షూటింగ్ ప్రారంభోతవ్సంలో తమన్నా కూడా పాల్గొంది.

‘రాజు గారి గది 3’ చిత్రం ప్రమోషన్స్ సందర్బంగా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఓంకార్ మరియు అశ్విన్ బాబులు తమ సినిమా నుండి తమన్నా తప్పుకోవడం పై స్పందిస్తూ ఉన్నారు. పదే పదే తమన్నా పేరును ప్రమోషన్స్ లో ప్రస్తావిస్తూ వస్తున్నారు. తమన్నా పేరును ఎక్కువ గా ప్రస్థావిస్తున్న కారణంగా ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా తన సన్నిహితుల దగ్గర స్పందించింది అని అంటున్నారు. తమన్నా కొంచెం హర్ట్ అయ్యిందంట అని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.