నటుడిగా దర్శకేంద్రుడు..ఫస్ట్ లుక్ వదిలిన రాజమౌళి

0

శతాధిక చిత్రాల దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు మొదటిసారి వెండితెరమీద కనిపించబోతున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చి అఖండ విజయాన్ని అందుకున్న ‘పెళ్ళి సందడి’ చిత్ర టైటిల్‌తోనే కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్, గౌరీ రోనాంకి జంటగా నటిస్తున్నారు. అయితే, ఈ మూవీలో నుంచి తాజాగా ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. దర్శకేంద్రుడి శిష్యుడు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ వీడియోను ట్విట్టర్‌లో ద్వారా విడుదల చేయడం విశేషం.

కాగా రాజమౌళి ..దర్శకేండ్రుడి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ఇప్పుడు ఆయన గురువుగారి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాఘవేంద్ర రావు వశిష్ట పాత్రలో తొలిసారి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతుండగా, తాజా వీడియోలో ఆయన సూటు, బూటు వేసి గాగుల్స్ పెట్టి స్టైలిష్ గా కనిపించారు. హీరో రోషన్, అనాటి ‘పెళ్లి సందడి’ సినిమా హీరోయిన్ దీప్తి భట్నాగర్, రాజేంద్రప్రసాద్ కూడా ఈ వీడియోలో కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.