ముదురు వయసులో పెళ్లికూతురుగా రాఖీ సావంత్.. ఆ రూమర్లకు చెక్!

0

బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు కనువిందు చేస్తుంటారు. 40 ఏళ్లు ఒంటిమీదికి వచ్చినా ఇంకా పెళ్లిచేసుకోని ఈ ముదురు భామపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, గ్యాసిప్పులు. తాజాగా ఆమె పెళ్లిపై ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రాఖీ సావంత్ ఒక ఎన్‌ఐఆర్‌ను రహస్యంగా పెళ్లిచేసుకున్నారని, ఈ వివాహం ఈనెల 28న జరిగిందని ప్రచారం చేశారు. ఈ వివాహానికి రాఖీ ఆప్తమిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారని చెప్పారు.

అయితే, ఈ వార్తల్లో నిజంలేదని రాఖీ సావంత్ తేల్చేశారు. షూటింగ్‌లో భాగంగా తాను పెళ్లికూతురులా సిద్ధమయ్యానని పేర్కొన్నారు. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ రూమర్‌పై మీడియాతో మాట్లాడిన రాఖీ సావంత్.. ‘‘జేడబ్ల్యూ మారియట్‌లో నేను పెళ్లి షూట్‌లో పాల్గొన్నాను. ఈ మాత్రం దానికి నాకు పెళ్లైపోయిందని ఈ జనం ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు. నాకు పెళ్లికాలేదు. నేను ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను. నేను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాను’’ అని రాఖీ వెల్లడించారు.

అలాగే, తాను పెళ్లికూతురు మేకప్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాఖీ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో రాఖీ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ముత్యంలా మెరిసిపోయే లాంగ్ ఫ్రాక్, చేతిలో వైలెట్ కలర్ పూలు, ఆ పూల రంగులోనే పెదాలకు లిప్‌స్టిక్‌తో రాఖీ సావంత్ మెరిసిపోయారు. ‘బ్రైడల్ షూటింగ్’ అనే క్యాప్షన్‌ను ఈ పోస్టుకు పెట్టారు.

 

View this post on Instagram

 

bridel shooting

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on
Please Read Disclaimer