బాలీవుడ్ బాంబ్ పెళ్లి అయిపోయిందా? అసలేం జరిగింది?

0

బోల్డ్ స్టార్ గా.. బాలీవుడ్ బాంబ్ గా పేరున్న నటి రాఖీ సావంత్. వివాదాలతో చెట్టాపట్టాలేసుకునే ఈ భామకు రహస్యంగా పెళ్లి జరిగిందంటూ భారీ ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముంబయిలోని ఒక హోటల్లో ఎన్నారైతో ఆమె పెళ్లి జరిగినట్లుగా వదంతులు వచ్చాయి. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లి వేడుకకు హాజరయ్యారని.. మరెవరినీ పిలవలేదని పేర్కొన్నారు.

రాఖీ పెళ్లి దుమారం సంచలనంగా మారింది. అయితే.. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై రాఖీ సావంత్ స్పందించారు. తనకు పెళ్లి కాలేదని చెప్పారు. నిప్పు లేకుండా పొగ రాదుగా..? రాఖీ పెళ్లి మీదనే ఎందుకు వార్తలు వచ్చినట్లు? అన్న ప్రశ్న వేసుకుంటే ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ముంబయిలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో బ్రైడల్ షూట్ జరిగింది. ఇందులో పాల్గొన్న రాఖీసావంత్ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. అసలుసిసలు పెళ్లికుమార్తెగా తయారైన ఆమెను చూసినంతనే వంటకం మొదలెట్టేసిన కొందరి పుణ్యమా అని రాఖీ సావంత్ పెళ్లి ఉత్త వార్తల పుణ్యమా అని జరిగిపోయింది.

తన పెళ్లి మీద వస్తున్న వార్తలతో రాఖీ కిందా మీదా పడుతోంది. తనకు పెళ్లి జరిగిపోయిందని జనాలు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదంటూ వాపోయారు. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని.. సింగిల్ గా ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. రాఖీ పెళ్లి విషయానికి వస్తే.. అప్పట్లో స్వయంవర్ పేరుతో ఒక రియాల్టీ షో చేసి.. అందులో ఎంపికైన వ్యక్తిని పెళ్లాడనున్నట్లుగా హడావుడి చేసినా.. అదంతా షో కోసమేనని తేలింది. తర్వాత ఇండియాస్ గాట్ టాలెంట్ షో కంటెస్టెంట్ దీపక్ కలాల్ న పెళ్లి చేసుకున్నట్లుగా రాఖీ గత ఏడాది వెల్లడించి ఒక్కసారి వార్తల్లోకి వచ్చారు.

ఆ తర్వాత పెళ్లి జరగటం లేదని స్పష్టం చేశారు. తాను చాలా మంచి అమ్మాయినని.. తన తల్లి.. సోదరుడు తన వల్ల బాధ పడుతున్నారని.. తానెంతో కష్టపడి ఇప్పుడున్న స్థాయికి తెచ్చుకున్నట్లుగా చెబుతూ దీపక్ కు సారీ చెప్పింది. ఒక వయసుకు చేరుకున్న తర్వాత పెళ్లి ముచ్చట మామూటే. ఏ వయసులో జరగాల్సిన వేడుక ఆ వయసులో జరగకుంటే ఇలానే ఉంటుంది మరి. మొత్తంగా చూస్తే.. ఫోటో షూట్ కు హాజరైన రాఖీకి పెళ్లి జరిగిపోయినట్లుగా వదంతులు వ్యాపించిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Please Read Disclaimer