తలుపులు బిడాయించి ఏం చేశాడంటే?

0

కాస్టింగ్ కౌచ్ గురించి నిరంతరం ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. కథానాయికలు డైరెక్టుగానే ఉన్న విషయాన్ని ఓపెన్ అయిపోతుండడంతో ఇక్కడ లీలలెన్నో బయటపడుతున్నాయి. ఇందులో హీరోలు.. సాటి నటులు.. డైరెక్టర్లు.. నిర్మాతలు అందరూ బయటపడిపోవాల్సొస్తోంది.

తాజాగా నాటీ బోల్డ్ గాళ్ రాకీ సావంత్ కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చాలా బోల్డ్ గా చెప్పుకొచ్చింది. ఆరంభంలో ఏమీ తెలియని వయసు. అప్పట్లో ఆడిషన్స్ కి వెళితే డైరెక్టర్లు తలుపులు బిడాయించేసి ట్యాలెంట్ చూపించమని అడిగేవారు. `షో యువర్ ట్యాలెంట్` అంటే ఏమిటో అర్థమయ్యేది కాదు. అయితే ఆ సన్నివేశం నుంచి ఏదోలా తప్పించుకుని బయటపడేదానిని అని తెలిపింది.

ఇంతకీ షో యువర్ ట్యాలెంట్ అంటే ఏమిటో? అని ప్రశ్నిస్తే.. అదో కోడ్ వర్డ్ అని ఆ తర్వాత తెలిసిందట. దానర్థం కాంప్రమైజ్ అవ్వమని.. కమిట్ మెంట్ కి ఓకే చెప్పమని అర్థం అట. అయితే ఆ కోడ్ వర్డ్ అర్థం కాక రాఖీ కన్ఫ్యూజ్ అయ్యేదట. అయితే ఇదంతా రాఖీ ఇప్పుడే ఎందుకు చెబుతోంది? అంటే ఏదో ఒక కొత్త పాయింట్ లేకపోతే వినేదెవరు? ఎవరికి వారు పబ్లిసిటీ స్టంట్ తో వేడెక్కిస్తున్నారు. ఇదేదో కొత్త విషయం అంటూ అలా బోల్డ్ డస్కీ బ్యూటీ వేడెక్కిస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.
Please Read Disclaimer