లక్కీ ఫ్రైడేని వాడుకుంటారా!

0

ఒక రోజు ఒక సినిమా విడుదల అనే ట్రెండ్ కి ఏనాడో స్వస్తి పలికిన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్దకు ఈ శుక్రవారం కూడా రెండు మూడు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ప్రధానంగా రెండింటి మధ్య పోటీ కనిపిస్తోంది. ఒకటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు. తమిళ్ బ్లాక్ బస్టర్ రీమేక్ కాబట్టి మేకర్స్ దీని మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ అక్కడ విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

ఆన్ లైన్లో చూసిన కొందరు తెలుగు ప్రేక్షకులు దీని మీద సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులు కురిపించారు. అయితే కమర్షియల్ అంశాలకు దూరంగా కేవలం కంటెంట్ ని నమ్ముకుని వస్తున్న ఈ సీరియస్ సినిమా మనవాళ్లకు ఎంత వరకు కనెక్ట్ ఆవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక రెండోది గుణ 369. ఆరెక్స్ 100తో సెన్సేషన్ హిప్పీతో డిజాస్టర్ రెండూ టేస్ట్ చేసిన కార్తికేయకు దీని సక్సెస్ చాలా అవసరం. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడం యూనిట్ కి రిలీఫ్ కలిగిస్తోంది

ఇప్పుడు ఈ రెండు సినిమాలకు ఒకరకంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మాస్ బలంగా ఉండే ప్రధాన కేంద్రాల్లో తప్ప ఇస్మార్ట్ శంకర్ చాలా చోట్ల నెమ్మదించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ నాలుగో రోజుకే వీకవ్వడం బయ్యర్లకు గుబులు పుట్టిస్తోంది. డివైడ్ టాక్ కొనసాగుతోంది తప్ప పాజిటివ్ గా మారడం లేదు. ఈ నేపథ్యంలో రాక్షసుడు-గుణ 369 కనక కంటెంట్ తో మెప్పిస్తే వీక్ ఎండ్ తో పాటు మన్మథుడు 2 వచ్చేదాకా టికెట్ కౌంటర్లను దున్నేయొచ్చు. కానీ టాక్ బాగా వస్తేనే ఇది సాధ్యం. మరి సక్సెస్ కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్న ఈ ఇద్దరు యూత్ హీరోలకు వచ్చే శుక్రవారం ఛాలెంజింగ్ గా మారనుంది.
Please Read Disclaimer